Begin typing your search above and press return to search.
సభ సూపర్ హిట్... వాట్ నెక్స్ట్...?
By: Tupaki Desk | 17 Dec 2021 2:30 PM GMTఅమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్ర చేశారు. ఏకంగా రెండు నెలల పాటు కష్టాన్ని ఓర్చి నడిచారు. కాళ్లరగదీసుకున్నారు. అంతే కాదు, ఎండను, వానను, చివరికి చలిని కూడా సహించి భరించి తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో దేవదేవుడి సాక్షిగా భారీ సభను నిర్వహించారు. ఒక విధంగా రెండేళ్లుగా సాగుతున్న అమరావతి రాజధాని రైతుల పోరాటానికి ఇది క్లైమాక్స్ అని చెప్పాలి. ఎన్నో ట్విస్టులు, ఎన్నో రిస్కులు, ఎన్నో మలుపులు, పిలుపులు, వేధింపులు, ఓదార్పులు, బాధలు, సాధింపులు అన్నీ దాటుకుని మరీ అమరావతి రైతుల పోరాటం ఈ రోజుకు వేలాది మందితో భారీ ఎత్తున సభగా జరిగింది.
అక్కడ ఒక్కటే నినాదం మోగింది. అమరావతి మన ఏకైక రాజధానిగా ఉండాలని అంతా ఒకే గొంతుకగా నినదించారు. అది కూడా రాయలసీమ గడ్డ మీద. శ్రీ భాగ్ ఒప్పందం అమలు కావాలని దశాబ్దాలుగా సీమలో తీరని ఆరని డిమాండ్ ఉన్న చోటనే అమరావతిలోనే అన్నీ ఉండాలి. అదే మనందరి రాజధాని కావాలి అని ఎలుగెత్తి చాటారు. సరే దీనికి సీమ నుంచి రీసౌండ్ ఉంటుందా ఉంటే అది ఏ విధంగా ఉంటుంది అన్నది వేరే విషయం కానీ రెండేళ్ల పాటు, రెండు క్యాలండర్ ఇయర్స్ ని కరిగించేస్తూ అలుపెరగకుడా అదే తీరున ఉద్యమం చేయడం మాత్రం నిజంగా ఒక అద్భుతమైన విషయమే అని చెప్పాలి.
దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరు మద్దతు ఇచ్చారు అన్నది పక్కన పెడితే ఎందరు ఎగదోసినా కూడా ఉద్యమంలో ఎంతో కొంత నీతి నిజాయతీ లేకపోతే ఇన్ని రోజుల పాటు నెలల పాటూ జరగదు కాక జరగదు, ఇక అక్కడ బినామీలు ఉన్నారా ఎవరు భూములు కొన్నారు అన్నది కూడా పక్కన పెట్టి ఆలోచిస్తే అవి అచ్చంగా రైతుల భూములు. ఆరుగాలం పంట పండించి నేల తల్లిని కన్న తల్లి కంటే మిన్నగా ఆరాధించే కష్టించే కర్షకుల భూములు.
వాటిని రాజధాని కోసం ఇచ్చారు అంటే త్యాగం అన్న పెద్ద మాట వాడడానికి ఇష్టపడకపోయినా తమ వంతుగా వారు రాష్ట్రానికి మేలు చేయడానికి ముందుకు వచ్చారని అనుకున్నా సరిపోతుంది. ఇక ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎవరికీ అర్ధం కాలేదు అంటోంది. అదే సమయంలో రాజధాని రైతుల గోడు కూడా పాలకులకు అర్ధం కాలేదు అని వారూ అనుకోవచ్చు.
ఇలా అర్ధం కాకుండా ఎవరికి వారు రెండేళ్ళు వృధాగా గడిపేసారు. ఇకనైనా ఇరు వర్గాలూ కాస్తా తగ్గి చర్చలకు సిద్ధపడితే మంచిది. ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చూడడమే మేలైన విధానం. మూడు రాజధానులలో ఉన్న బలమైన వాదనను అమరావతి రైతులకు ఒప్పించి మెప్పించి అందరికీ మేలు చేస్తే మంచిదే. అదే విధంగా ఏకైక రాజధానిగా అమరావతిని ఉంచుతూ ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కంకణం కట్టుకుని పనిచేసినా మంచిదే.
అంతే తప్ప ఇలాగే ఉద్యమాలు చిరకాలం కొనసాగడం మంచిది కాదు, అందునా ఏపీ లాంటి విభజనతో గాయపడిన రాష్ట్రానికి అంతకంటే మేలు కాదు. ఏదీ మీ రాష్ట్రం అంటే తల ఎక్కడ పెట్టుకోవాలలో అర్ధం కావడంలేదు అన్న సీపీఐ నారాయణ వ్యధ ఆయనదే కాదు సుమా అది ఏపీలోని అయిదు కోట్ల జనాలది. ఇకనైనా అలాంటి వాటికి తెరదించేలా ప్రభుత్వ పెద్దలు కదలాలి. అదే సమయంలో అమరావతి ఉద్యమాన్ని విజయవంతంగా కలసి వచ్చిన వారితో నడిపించిన రైతులు సమస్యకు సరైన పరిష్కారం ప్రభుత్వం వద్దనే ఉందని అక్కడే తేల్చుకోవాలని చర్చలకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే రాజధాని సభ సూపర్ హిట్ కి దక్కే అసలైన రిజల్ట్.