Begin typing your search above and press return to search.
అమరావతి.. అంతర్జాతీయ కామెడీలు అస్సలు ఆగడం లేదు!
By: Tupaki Desk | 8 March 2020 2:30 PM GMTఈ మధ్యనే అమరావతిపై అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లినట్టుగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు. ఆ పార్టీ వీరాభిమానులు అయిన ఎన్ ఆర్ ఐలు అంతర్జాతీయ న్యాయస్థానంలో అమరావతి విషయంలో కేసు వేశారట. అయితే ఆ కేసును విచారణకు స్వీకరిస్తున్నట్టుగా కానీ, దానిపై ప్రత్యుత్తరం ఇస్తామని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పలేదు. వీరు పిటిషన్ ఇచ్చారు. ది హేగ్ లోని ఆ న్యాయస్థానం తీసుకుందంతే. దీనిపై తదుపరి అప్ డేట్స్ ఇస్తే ఆ కోర్టు ఇవ్వాలి, అంతే కానీ ఉత్తరప్రత్యుత్తరాలకు అవకాశం ఉండదట.
అయితే... అసలు భారత దేశంలో ఒక రాష్ట్ర రాజధాని వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా? ఇక్కడ కొంతమంది రియలెస్టేట్ వ్యాపారులు ధర్నాలు చేయించినంత మాత్రాన మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతున్నట్టేనా? అసలు అమరావతిని రాజధాని హోదా నుంచి తప్పించడం లేదు ఏపీ ప్రభుత్వం. ఈ విషయంలో రాష్ట్రానికే నిర్ణయాధికారమని భారత ప్రభుత్వమే స్పష్టం చేసింది. అయితే.. కోతి పుండు
బ్రహ్మాండం అన్నట్టుగా.. అమరావతి ఇష్యూను అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లి ప్రచారం పొందాలని టీడీపీ బ్యాచ్ ప్రయత్నిస్తూ ఉంది.
ఆ సంగతలా ఉంటే.. ఈ వ్యవహారంపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో కూడా పిటిషన్ దాఖలు చేశారట. అమరావతి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉందని ఫిర్యాదు చేశారట. అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన వ్యక్తులే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో కూడా పిటిషన్ దాఖలు చేశారట! ఇలా అమరాతి విషయంలో అంతర్జాతీయ కామెడీలు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి.
అయితే.. ఇప్పటి వరకూ అమరావతిని రాజధానిగా మార్చలేదు. మూడు రాజధానుల్లో ఒకటిగా అమరావతి కొనసాగుతుంది. అమరావతి ఆందోళనలకు స్వయంగా చంద్రబాబు నాయుడు స్పాన్సర్ షిప్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. నిధుల సేకరణ చేసి.. ఆందోళనలకు ఆయన స్పాన్సర్ గా వ్యవహరించినట్టే. ఇలాంటి పెయిడ్ ఉద్యమాలను అంతర్జాతీయ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయా? ఆ హక్కు వాటికి ఉందా? కాస్త ఇంగిత జ్ఞానం ఉంటే.. ఇలాంటి పనులు జరగవేమో!