Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిని ఎలా చేస్తామంటే..?

By:  Tupaki Desk   |   22 Oct 2015 5:48 AM GMT
అమ‌రావ‌తిని ఎలా చేస్తామంటే..?
X
ఎన్నో రోజులుగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం మొద‌లైంది. అట్ట‌హాసంగా మొద‌లైన కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌లుగా సినీన‌టుడు సాయికుమార్‌.. గాయ‌ని సునీత వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాము ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాల‌న్న అంశాల‌కు సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌కు చెప్పింద‌ని వ్యాఖ్య‌త‌లు బుధ‌వారం చెప్ప‌టం తెలిసిందే.

దీనికి త‌గ్గ‌ట్లే ఏపీ భ‌విష్య‌త్తు రాజ‌ధానిని ఎలా త‌యారు చేయాల‌న్నత‌మ ల‌క్ష్యాన్ని ఏపీ స‌ర్కారు వ్యాఖ్యాత‌ల చేత చెప్పించేసింది. ప్ర‌పంచ రాజ‌ధానుల్లో అత్యుత్త‌మ రాజ‌ధానిగా రూపొందించాల‌న్న‌దే త‌మ లక్ష్యంగా పేర్కొన్న వ్యాఖ్య‌త‌లు.. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ప‌లు రాజ‌ధాని ప‌ట్ట‌ణాల్ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

ప్రాచీనం.. ఆధునికం క‌ల‌గ‌లిపి.. వినూత్న రాజ‌ధాని నిర్మాణ‌మే త‌మ లక్ష్యంగా ఏపీ స‌ర్కారు వ్యాఖ్య‌త‌ల చేత చెప్పించింద‌న్న భావ‌న క‌లిగేలా చేసింది. ప్రాచీన రాజ‌ధానుల్లో అత్యుత్త‌మ‌మైన రోమ్‌.. లండ‌న్‌..ఆధునిక రాజ‌ధాని న‌గ‌రమైన న్యూయార్క్‌.. పారిస్‌ ల‌తో పాటు.. సింగ‌పూర్‌.. పుత్ర‌జ‌య‌.. టోక్యో.. బీజింగ్ న‌గ‌రాల సంగ‌మంగా అమ‌రావ‌తిని నిర్మించాల‌న్న‌దే త‌మ ల‌క్ష్యంగా చెప్పుకొచ్చారు.

విన్న వెంట‌నే పుల‌క‌రించి పోయేలా మ‌హా రాజ‌ధానుల పేర్లు ప్ర‌స్తావించి.. అమ‌రావ‌తి మీద అంచ‌నాల్నిమ‌రింత పెంచే ప్ర‌య‌త్నంలో ఏపీ స‌ర్కారు ఉన్న‌ట్లుంది. అందుకు.. వ్యాఖ్యాత‌ల గాత్ర స‌హ‌కారం తీసుకున్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx