Begin typing your search above and press return to search.
బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటారా ?
By: Tupaki Desk | 17 March 2021 11:30 AM GMT‘నేను నిప్పును.. ఏ తప్పు చేయను..నాపై ఎలాంటి విచారణ అయినా చేయించుకోవచ్చు..దమ్ముంటే నన్ను అరెస్టుచేసి జైల్లోపెట్టండి’...ఇది చంద్రబాబునాయుడు కొద్ది కాలం క్రితం వరకు మాట్లాడిన మాటలు, చేసిన సవాళ్ళు. తీరా అసైన్డ్ భూముల కుంభకోణంలో విచారణకు రమ్మని సీఐడీ అధికారులు నోటీసు ఇవ్వగానే బెంబేలెత్తిపోతున్నారు. నోటీసు అందుకున్న తర్వాత నుండి న్యాయనిపుణులతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారట.
చంద్రబాబు విషయాన్ని పక్కన పెట్టేస్తే తమ అధినేతకు సీఐడీ నోటీసులివ్వటం వేధింపులు తప్ప మరోటి కాదంటు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు అండ్ కో ఒకటే గోల చేస్తున్నారు. ఎప్పుడో 2015లో జరిగిన భూసేకరణపై ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇవ్వటం ఏమిటి ? అని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. భూసేకరణ 2015లో జరిగింది వాస్తవమే. అయితే 2019 వరకు టీడీపీనే అధికారంలో ఉందికదా.
టీడీపీ అధికారంలో ఉన్నతర్వాత చంద్రబాబుకు నోటీసులు ఎవరిస్తారు ? పైగా తమ్ముళ్ళ వాదన ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబుకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నట్లుంది. పైగా నోటీసులిచ్చింది అసైన్డ్ భూముల కుంభకోణంపైన అయితే తమ్ముళ్ళంతా కావాలనే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగనే లేదని హై కోర్టు తేల్చేసింది కదా అంటూ పదే పదే అడుగుతున్నారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు వేరు, అసైన్డ్ భూముల కుంభకోణం వేరని బాగా తెలిసినా కావాలనే జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు చంద్రబాబుకు సీఐడీ నోటీసు ఇవ్వటాన్నే తప్పు పడుతున్నారు. చంద్రబాబు సీఐడీ విచారణకు హాజరైతే ఏమవుతుంది ? విచారణలో అధికారులు అడిగేది వాళ్ళడుగుతారు, చంద్రబాబు చెప్పేది చెబుతారు. ఇంత మాత్రానికే చంద్రబాబు అండ్ కో ఎందుకింత టెన్షన్ పడిపోతున్నారో అర్ధం కావటంలేదు.
చంద్రబాబుకు జ్యూడిషియరీ కొత్తకాదు. చిటికేస్తే క్షణాల్లో వాలిపోయే ఉద్దండ పిండాలవంటి లాయర్లు ఉన్నారు. నిజంగా ప్రభుత్వానికి కక్షసాధింపులు, వేధింపులే అయితే అదే విషయాన్ని లాయర్లు కోర్టుల్లో నిరూపించేస్తారు. ఇప్పటివరకు తాను నిప్పునని చెప్పుకోవటమే కానీ ఎక్కడా నిరూపించుకోలేదు. కాబట్టి సీఐడీ విచారణకు హాజరైతే కోర్టులో నిజంగానే తాను నిప్పునని నిరూపించుకున్నట్లవుతుంది.