Begin typing your search above and press return to search.
అందరికి అమరావతి ‘సినిమా’ చూపించారు
By: Tupaki Desk | 26 March 2017 6:17 AM GMTవచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అమరావతి నిర్మాణాన్ని షురూ చేసి.. నాలుగు బిల్డింగులు కట్టించి.. అదిగో అమరావతి అంటూ అందరికి చూపించటమే కాదు.. మిగిలిన పార్ట్ ను పూర్తి చేయటానికి తమకు మరింత సమయం కావాలని.. అందుకు మరోసారి అధికారాన్ని తమకు ఇవ్వాలన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చే కార్యక్రమానికి నాందీ ప్రస్తావన లాంటి కార్యక్రమంతాజాగా జరిగింది.
అమరావతిలో నిర్మించే పరిపాలనా నగరిని భారీగా నిర్మించి.. ఓటర్ల మనసుల్ని దోచుకునేలా నాలుగు భవనాల్నినిర్మించాలన్న ఆలోచనతో బాబు సర్కారు ఉందన్న విషయం తాజాగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం చెప్పకనే చెప్పేసింది.27 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లుగా పేర్కొన్నారు. ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రజంటేషన్ వేసి చూపించిన ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ అమరావతి ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రజంటేషన్ లో కీలక అంశాల్ని చూస్తే..
= పరిపాలనా నగరాన్ని అమరాతిలోని 900 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందులో నిర్మాణ విస్తీర్ణం 33 లక్షల చదరపు అడుగుల మేర ఉండనుంది.
= ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక సచివాలయం.. అసెంబ్లీ.. మండలి భవనాల విస్తీర్ణం 6లక్షల చదరపు అడుగులు. దీనికి ఐదు రెట్లకు పైనే కొత్త భవనాల్నినిర్మిస్తారు. ఖర్చు అదే స్థాయిలో కానుంది.
= పరిపాలనా నగరంలో నిర్మాణాలవిస్తీర్ణం మొత్తంవిస్తీర్ణంలో 25 శాతం మాత్రమే.మిగిలిన విస్తీర్ణంలో 51 శాతం పచ్చదనం.. 10 శాతం జలవనరులు.. 14 శాతం రోడ్ల కోసం కేటాయించనున్నారు. ఈ నగరంలోని ప్రధాన రహదారిలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మాత్రమే ప్రయాణించేలా నిర్మించనున్నారు.
= 217 చదరపుకిలోమీటర్లు.. 55 వేల ఎకరాల్లో ఉండే రాజధాని అమరావతి నగరంలో ప్రధానమైనసీడ్ క్యాపిటల్ 67 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది.ఇందులో 6.9 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని తమకు కేటాయిస్తే.. ప్రపంచ స్థాయి కంనీలను ఇక్కడ తీసుకొస్తామని సింగపూర్ కు చెందిన నార్మన్ సంస్థల కన్సార్టియం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
= స్విస్ ఛాలెంజ్ విధానంలో దీనికి పోటీ బిడ్లను పిలిచి ఈ ప్రతిపాదనను ఖరారు చేయనున్నారు.
= పరిపాలనానగరి తరహాలో అమరావతిలో మొత్తం తొమ్మిది నగరాల్ని నిర్మిస్తారు. ఒక్కో సిటీలోమూడు అంతర్గత టౌన్ షిప్పులు నిర్మిస్తారు.ప్రతి టౌన్ షిప్ లోనూ.. నివాస భవనాలు..షాపింగ్ మాల్స్..ఆసుపత్రులు..పాఠశాలలు.. కార్యాలయాలు లాంటివి ఉంటాయి.
= ప్రభుత్వ నగరిలో అసెంబ్లీని నిర్మిస్తారు. దాని వెనుకనే జస్టిస్ సిటీని నిర్మిస్తారు.అందులోనే హైకోర్టు భవంతిని నిర్మిస్తారు.
= ప్రభుత్వ నగరిని నాలుగు బ్లాకులుగా విభజిస్తారు. అసెంబ్లీ బిల్డింగ్ తో మొదలయ్యే ఈనగరిలో సచివాలయం.. సీఎం..గవర్నర్ నివాసాలు..తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేలు..తర్వాత ఐఏఎస్.. ఐపీఎస్ నివాసాలు..ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి.
= నగరికి మధ్యలో పెద్ద జల ప్రవాహం ఉంటుంది.ఇందులో పడవుల్లో ప్రయాణించే వీలు ఉంటుంది. వాటి పక్కనే నడకదారులు.. సైకిల్ వాడేందుకువీలుగా దారులు.. వినోద కేంద్రాలు.. ఫుడ్ కోర్టులు రానున్నాయి. నదికి పక్కనే ప్రభుత్వ నగరికి ముందు పెద్ద పార్కును ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీకి ముందు సాధార ప్రజలకుఅందుబాటులో ఉండేలా పెద్ద మ్యూజియం..కల్చరల్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.
= ప్రభుత్వ నగరి నాలుగు బ్లాకుల్లో మొదటి బ్లాకులోఅసెంబ్లీ.. సచివాలయం.. సీఎం..గవర్నర్ నివాసాలు..శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. రెండో బ్లాక్ లో మంత్రులు.. ఉన్నతాధికారుల ఇళ్లు రానున్నాయి. రెండో బ్లాక్ లో 80 శాతం ప్రభుత్వ భవనాలే ఉండనున్నాయి. మిగిలిన రెండు బ్లాకుల్లో వాణిజ్య భవనాలు వస్తాయి.
= ప్రభుత్వ నగరికి మొత్తం నాలుగు ప్రవేశ మార్గాలు ఉండనున్నాయి. తిరుమల దేవాలయం మాదిరి శిఖరాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. రోడ్ల మీద వేర్వేరువాహనాలకువేర్వేరు దారులు కేటాయిస్తారు. ప్రవేశ మార్గాల మధ్యలో కార్లు..ఆ పక్కన బస్సులు..వాటి తర్వాత సైకిళ్లు.. చివరా నడక దారులు ఉండేలా చేస్తారు.
= మొత్తంగా 51 శాతం పచ్చదనం.. 16 శాతం జలాలు ఉండేలా చూస్తారు.
= ప్రతి వంద.. 150 మీటర్లకు మించి నడిచే పని లేకుండా సిటీ బస్సుల సౌకర్యం ఉంటుంది.ప్రభుత్వ నగరిలో ఎలక్ట్రిక్ కార్లు పెట్టే ప్రతిపాదన ఉంది.ఇందులో డ్రైవర్లు ఉండరు.వాటిల్లోకి ఎక్కిబటన్ నొక్కితో కంప్యూటర్ నియంత్రణలో కావాల్సి చోటికిఅవే తీసుకెళతాయి.
= లండన్ లోని ట్రెఫాల్గర్ స్వ్కేర్ మాదిరి ప్రభుత్వ నగరిలో సిటీ స్క్వేర్ వస్తుంది.ఢిల్లీలోనిరాజ్ పథ్ లో గణతంత్ర వేడుకలకుఎలా అయితే ఉంటుందో..అదే తీరులో ఇక్కడా.. పెరేడ్ రహదారి.. పెరేడ్ మైదానాలు ఏర్పాటు చేస్తారు.
= అమరావతిలో కొన్ని ముఖ్య భవనాల ఎత్తు ఎక్కువగా ఉండవు. దీనికి కారణం లేకపోలేదు. అమరావతిలో గాలుల ప్రవాహ దిశలపై అధ్యయనం చేసిన లండన్ సంస్థ.. గాలి ప్రవాహం ఎక్కువగా ఉంటే.. ఉక్కపోతలు ఉండవని అంచనా వేశారు. భవనాల ఎత్తు తగ్గించి.. గాలులు నదివైపు వెళ్లే కొద్దీ భవనాల ఎత్తు పెరుగుతూ ఉంటుంది. ఆకాశ హర్మ్యాలు నది పక్కనే ఉండటం వల్ల.. గాలి సాఫీగా ఉండటంతో పాటు.. ఉష్ణోగ్రతలు కొంతమేర అదుపులో ఉండనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
= నది ఒడ్డున ఏర్పాటు చేసే పార్కు.. విదేశాల్లోని పార్కుల నమూనాలో భారీగా ఉండనుంది.
= పాదచారులు నడిచేదారుల్లో పైకప్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. దీంతో.. ఎండా.. వానలప్పుడు ఇబ్బంది పడకుండా ఉండే వీలుంటుంది.
= షాపింగ్.. ఫుడ్ కోర్టులు రోడ్డు పక్కనే ఏర్పాటుచేస్తారు.
= ఆడ్మినిస్ట్రేటివ్ సిటీ తుది డిజైన్లు మేలో రానున్నాయి. జులైలో వీటి పనులు మొదలు కానున్నాయి.2018 డిసెంబరు నాటికి వీటిని పూర్తి చేయాలని డిసైడ్ చేశారు. రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం హడ్కో నుంచి రూ.7500 కోట్లు తీసుకురావాలని భావిస్తోంది. అదే సమయంలో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4వేల కోట్లు.. కేంద్రం నుంచి రూ.1500 కోట్లు వస్తాయని ఆశిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/