Begin typing your search above and press return to search.

బాబు - లోకేష్ సంతోషాన్ని ఆవిరి చేసిన ఐవైఆర్‌

By:  Tupaki Desk   |   15 Aug 2018 5:13 AM GMT
బాబు - లోకేష్ సంతోషాన్ని ఆవిరి చేసిన ఐవైఆర్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ త‌మ సంతోషాన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే కోల్పో్యే ప‌రిణామం ఇది. ఒక‌వైపు మోదం మ‌రోవైపు ఖేదం వంటి పరిస్థితి ఈ తండ్రి - తన‌యులు ఎదుర్కోవాల్సి ప‌రిస్థితి వ‌చ్చింది. అమరావతి బాండ్ల పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున క‌లిగిన మైలేజీని త‌మ సొంత ఖాతాలో వేసుకునేందుకు త‌ద్వారా బ్రాండ్ ఇమేజ్‌ ను పెంచుకునేందుకు ఈ నేత‌లు ప్ర‌య‌త్నిస్తే...అందులో అస‌లు కిటుకును బ‌య‌ట‌పెడుతూ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు విస్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇచ్చారు. త‌ద్వారా నిమిషాల వ్య‌వ‌ధిలో టీడీపీ నేత‌లు అవాక్క‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది.

అమ‌రావ‌తి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ఈ) ద్వారా రూ. 1300 కోట్ల విలువైన బాండ్లను జారి చేసి విజయం సాధించింది. ఈ బాండ్ల ఇష్యూకు 1.5 రెట్ల స్పందన వచ్చింది. అంటే సుమారు రూ.2000 కోట్ల విలువైన బాండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో బాండ్ విలువ రూ.10 లక్షలు. కేవలం సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే ఆఫర్ చేశారు. బాండ్ల ఇష్యూ ఓవర్ సబ్ స్క్రయిబ్ అయితే మరో రూ. 700 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు సీఆర్డీఏ ముందే అనుమతి తీసుకుంది. దీంతో అదనపు బాండ్లు జారీ చేసి రూ. 2000 కోట్లను సమీకరించనుంది. ఈ లెక్కన ఇవాళ్టి ఇష్యూ ద్వారా రూ. 2000 కోట్లు సాధించిన సంస్థగా సీఆర్డీఏ రికార్డు సాధించింది. కాగా, ఈ ప‌రిణామంపై సీఎం చంద్ర‌బాబు - మంత్రి లోకేష్‌ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది అమ‌రావ‌తిపై ఉన్న న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇన్వెస్టర్లకు అమరావతి నిర్మాణంపై ఉన్న భరోసాకు ఈ ఇష్యూ స్పందన నిదర్శనమన్నారు.

అయితే ఈ ఎపిసోడ్‌ పై ఐవైఆర్ ట్విట్ట‌ర్‌ లో స్పందించారు. సూటిగా కామెంట్లు చేస్తూ ఈ ప్ర‌క్రియ‌ను విశ్లేషించారు. ``#అమరావతి బాండ్ల వడ్డీ 10. 3 2%. అది క్వార్టర్లీ బేసిస్ మీద. రాష్ట్ర ప్రభుత్వ హామీ ఈ అప్పుకు ఉంది. క్రితం వారం జిహెచ్ ఎంసి బాండ్లు 8. 9% వడ్డీతో సబ్ స్క్రయిబ్ అయినాయి. పూనా బాండ్లు 7. 5 9%. ఈ బాండ్ల కోసం మనం ఇస్తున్న కమీషను 17 కోట్ల రూపాయలు. ఏ రకంగా ఇది లాభదాయకమో అర్థం కావటం లేదు.`` అంటూ ఓ ట్వీట్‌ లో ప్ర‌భుత్వం ఎగిరి గంతు వేయాల్సిన సీనేమీ లేద‌ని తేల్చిచెప్పేశారు. మ‌రో ట్వీట్‌ లో ``#అమరావతిబాండ్లు టెండర్లపై నా ప్రసంగం Foundation for social awareness సంస్థ యూట్యూబ్ అకౌంట్ లో. అమరావతి బాండ్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయినాయి అని వార్త చూశాను. రాష్ట్రప్రభుత్వం హామీ ఉండి అధిక వడ్డీ శాతం చెల్లించే టప్పుడు ఓవర్ సబ్ స్క్రైబ్ అవటం సహజం. ఆశ్చర్యం లేదు.`` అంటూ అస‌లు విష‌యాన్ని తేట‌తెల్లం చేశారు.