Begin typing your search above and press return to search.
సంక్రాంతిలోపు అమరావతి పనులు స్టార్ట్
By: Tupaki Desk | 7 Dec 2015 7:20 AM GMTనవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. అమరావతి సీడ్ కాపిటల్ నిర్మాణాలలో కీలకమైన రాష్ట్ర శాసనసభ - హైకోర్టు భవనాలను విదేశీ పరిజ్ఞానంతో నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విదేశీ సంస్థల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తికావచ్చింది. సీఆర్ డీఏ పరిధి 8352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో అవసరమైన భూ సమీకరణ జరిపి నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణానదిపై రెండు ఐకాన్ వంతెనల నిర్మాణం జరపాలని ప్రతిపాదించారు. అవుటర్ రింగురోడ్డులో భాగంగా ఇబ్రహీంపట్నం నుంచి నేరుగా రాజధానికి చేరుకునే విధంగా వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. దీనికితోడు రాజధాని ఎక్స్ ప్రెస్ వేతో పాటు అవుటర్ రింగురోడ్డు - ఇతర జాతీయ రహదార్ల నిర్మాణం, విస్తరణకు సంబంధించి రూ. 65 వేల కోట్లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఆర్ డీఏ కసరత్తు ప్రారంభించింది. శాసనసభ - హైకోర్టు నిర్మాణానికి ఆరు విదేశీ సంస్థలు సంసిద్ధత వ్యక్తంచేశాయి. ఇందులో ప్రపంచ ప్రమాణాలు పాటించే మూడు సంస్థలను జ్యూరీ ఎంపిక చేసింది. ఢిల్లి తరహాలో భవన సముదాయాలు ఉండే విధంగా మెగా నగరాలను కాలదన్నే రీతిలో అమరావతి రూపుదిద్దుకోనుంది.
శాసనసభ - హైకోర్టు భవనాలు విదేశీ సంస్థలు.. మిగిలిన నిర్మాణాలు స్వదేశీ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమయింది. తొలిదశలో నిర్మాణాలకు అవసరమైన 12వేల 594 ఎకరాల భూమిని సీఆర్ డీఏకు అప్పగించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో 2,600 ఎకరాలలో వీలైనంత త్వరలో నిర్మాణాలు చేపట్టాలని సీఆర్ డిఏ అధికారులు భావిస్తున్నారు. రాజధాని ప్రతిపాదిత 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో మరికొన్ని కీలకమైన భవనాలను నిర్మించే కన్సల్టెన్సీలను ఎంపిక చేయాలని నిర్ణయించింది.. ఇందులో భాగంగా సీఆర్ డీఏ టెండర్లను ఆహ్వానించింది. ప్రభుత్వ కార్యాలయాలు వీవీఐపిలు, ఉద్యోగుల నివాసాలకు అవసరమైన డిజైన్లు అందించే సంస్థలను ఎంపిక చేసేందుకు టెండర్లను ఆహ్వానించిది. ఆర్కిటెక్చర్ - డిజైన్ - ల్యాండ్ స్కేప్ - ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో అనుభవం ఉన్న సంస్థలకు నిర్మాణంలో అవకాశం కల్పించనున్నారు. ప్రజలు వినియోగించుకునే విధంగా అనువైన స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాల్సిన పనికూడా నిర్మాణ సంస్థలకు అప్పగించనున్నారు.
సెక్రటేరియట్ - హెచ్ ఓడీల కార్యాలయాలు, ఇతర స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను1312 ఎకరాలు, సిబ్బంది నివాసాలకు 740, వీఐపీల హౌసింగ్ కు 328 ఎకరాలు - రాజ్ భవన్ కు 92 ఎకరాలు, ముఖ్యమంత్రి కార్యాలయానికి 69ఎకరాలు, ప్రభుత్వ అతిథి గృహానికి 74.04 ఎకరాలు మొత్తంగా 2615 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతారు. ఈ నెల 11వ తేదీన టెండర్ల దరఖాస్తుకు చివరి రోజు కాగా, 14వ తేదీన ఎంపిక చేస్తారు. అనంతరం నెలరోజుల్లో నిర్మాణాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.