Begin typing your search above and press return to search.
బీజేపీలో చేరను.. కాంగ్రెస్ లో ఉండను: మాజీ సీఎం
By: Tupaki Desk | 30 Sep 2021 1:30 PM GMTపంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ అడుగులు ఎటువైపు పడుతాయన్నది ఆసక్తిగా మారింది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం తీరుతో విసుగు చెందిన అమరీందర్ పంజాబ్ సీఎం సీటుకు రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ గా సిద్దూను నియమించినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న అమరీందర్ సింగ్ ఇక విసిగి వేసారి ఆ పార్టీ నుంచి వైదొలిగారు. ఇక సిద్దూ కూడా అక్కడ రాజీనామా చేయడం కాంగ్రెస్ లో సంక్షోభానికి దారితీసింది.
ఆ తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీ వచ్చి బీజేపీ పెద్దాయన కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ తాజాగా విలేకరులతో మాట్లాడిన అమరీందర్ పార్టీ మార్పుపై స్పందించారు.
తాను బీజేపీలో చేరట్లేదని.. కానీ త్వరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు. దీంతో అమరీందర్ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ సీఎంగా అమరీందర్ రైతులతో కలిసి 10 నెలలుగా పెదద్ ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దాని విషయమే హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్టు వెల్లడించారు.
ఇక తాను సీఎం కుర్చీని వదిలేసానని.. తాను రాజకీయాలు విడిచిపెట్టలేదని.. చివరి వరకు పోరాడుతానని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. దీంతో అమరీందర్ అడుగులు ఎటువైపు పడుతాయన్నది ఆసక్తి రేపుతోంది.
బీజేపీ కెప్టెన్ అమరీందర్ కు రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు సమాచారం. అయితే అమరీందర్ ను సీఎం క్యాండిడేట్ గా బీజేపీ ఒప్పుకోలేదని అందుకే ఆ పార్టీలో చేరకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీలో అమరీందర్ చేరే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక అమరీందర్ ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. ఆయనను వేరే పార్టీలో చేరకుండా అనునయిస్తున్నట్టు సమాచారం.