Begin typing your search above and press return to search.

సీఎం భార్య‌కే టోక‌రా...భారీ మొత్తంలో డ‌బ్బు స్వాహా

By:  Tupaki Desk   |   8 Aug 2019 5:53 AM GMT
సీఎం భార్య‌కే టోక‌రా...భారీ మొత్తంలో డ‌బ్బు స్వాహా
X
ఆధునిక సాంకేతిక ప్ర‌పంచంలో ఆన్‌లైన్ విధానం వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో ? అంత‌కు మించిన మోసాలు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో కార్య‌క‌లాపాలు అన్ని డిజిట‌ల్ మ‌యం అయిపోయాయి. దీని వ‌ల్ల ఏ ప‌ని అయినా ఎంత స్పీడ్‌ గా అవుతుందో ? మ‌నకు తెలియ‌కుండానే అంతే స‌లువుగా మోస‌పోతున్నాం. సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లో సామాన్యులే కాకుండా సెల‌బ్రిటీలు కూడా దారుణంగా మోస‌పోతున్నారు. తాజాగా ఈ వంతు ఈ సారి ఏకంగా ఓ సీఎం భార్య‌దే అయ్యింది.

పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ భార్య - ఎంపీ ప్రణీత్‌ కౌర్ సైబ‌ర్ మోస‌గాళ్ల భారీన ప‌డి ఏకంగా రూ.23 ల‌క్ష‌లు పోగొట్టుకున్నారు. ఓ బ్యాంక్ మేనేజ‌ర్ పేరిట ఆమె కాల్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె అక్కౌంట్ నుంచి రూ.23 లక్ష‌లు గ‌ల్లంత‌య్యాయి. చివ‌ర‌కు తాను మోస‌పోయాన‌ని తెలుసుకున్న ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగి విచార‌ణ చేప‌ట్టి అస‌లు నిందితుడిని అరెస్టు చేశారు.

పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. త‌న‌ను బ్యాంక్ మేనేజ‌ర్‌ గా ప‌రిచ‌యం చేసుకోవ‌డంతో పాటు మీ ఎంపీ జీతం డిపాజిట్ చేయ‌డం కోసం.. మీ అక్కౌంట్ అప్‌ డేట్ చేయాల్సి ఉంద‌ని చెప్పాడు. ఈ క్ర‌మంలోనే ఆమె నుంచి అకౌంట్‌ నంబరు - ఏటీఎం పిన్‌ నంబరు - సీవీసీ నంబరు తదితర వివరాలు తీసుకున్నాడు.

ప్ర‌ణీత్ కౌర్ అత‌డి గురించి ఏ మాత్రం ఆరా తీయ‌కుండానే వివ‌రాలు మొత్తం ఇచ్చేశారు. చివ‌ర‌కు త‌న అక్కౌంట్ నుంచి రూ.23 ల‌క్ష‌లు డ్రా చేసిన‌ట్టు మెసేజ్ వ‌చ్చింది. వెంట‌నే ఖంగుతిన్న ఆమె సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. చివ‌ర‌కు సైబ‌ర్ క్రైం పోలీసులు నిందుతుడు జార్ఖండ్‌ కు చెందిన వాడిగా గుర్తించి వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. ఇక‌పై ఎవ‌రైనా ఫోన్ చేసి బ్యాంక్ అక్కౌంట్ వివ‌రాలు - ఏటీఎం నెంబ‌ర్ అడిగితే ఇస్తే ఇలాంటి ప‌రిణామాలే ఎదుర్కోవాల్సి వ‌స్తోంది త‌స్మాత్ జాగ్ర‌త్త‌.