Begin typing your search above and press return to search.

కలెక్టర్ ను హీరోయిన్ అంటూ పని రాదన్నాడు

By:  Tupaki Desk   |   31 May 2016 3:48 PM IST
కలెక్టర్ ను హీరోయిన్ అంటూ పని రాదన్నాడు
X
ప్రజాప్రతినిధులు చాలా బాధ్యతగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా నేతల బరి తెగింపు యవ్వారాలు ఈ మధ్యన ఎక్కువైపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాయ్ పూర్ లో చోటు చేసుకుంది. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్జిత్ భగత్ కు నోటి దురద కాస్త ఎక్కువ. ముందు వెనుకా చూడకుండా ఫైర్ అయ్యే ఇతగాడి నోటికి.. సర్ గుజ (అంబికాపూర్) జిల్లా కలెక్టర్ రితూసేన్ బలయ్యారు.

మహిళా కలెక్టర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్నే రేపాయి. హీరోయిన్ మాదిరి అందంగా ఉన్నావంటూ మాట్లాడిన ఎమ్మెల్యే.. పని చేయటం మాత్రం రాదే అంటూ మండిపడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మహిళా కలెక్టర్ అన్న గౌరవం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఎపిసోడ్ పై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయటంతో ఎమ్మెల్యే అమర్ జిత్ భగత్ మీద పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. తొందరపడి మాట తూలటం ఎందుకు? వివాదాల్లో చిక్కుకుపోవటం ఎందుకో..?