Begin typing your search above and press return to search.

ఊస‌ర‌వెల్లి షాక‌య్యేలా బాబు తీరు..గాంధీజీతో పోలిక ఏంటి?

By:  Tupaki Desk   |   12 Jan 2020 4:33 PM GMT
ఊస‌ర‌వెల్లి షాక‌య్యేలా బాబు తీరు..గాంధీజీతో పోలిక ఏంటి?
X
ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌ నాథ్ ఘాటుగా స్పందించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు తీరును ఆయ‌న ఖండించారు. ``ఊసరవెల్లి సైతం ఉరేసుకునేలా ఉంది చంద్రబాబు తీరు. రోజుకో స్ర్కిప్ట్ - లొకేషన్‌ లో చంద్రబాబు ఉద్యమం జ‌రుగుతోంది. చంద్రబాబు ఉద్యమం తన భూముల రేట్ల కోసమే. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు తీరు ఇదేనా? ` అని ప్ర‌శ్నించారు.

త‌న ర‌క్తం మ‌రిగిపోతోంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించడాన్ని అమ‌ర్‌ నాథ్ ఎద్దేవా చేశారు. ``ఇసుక దోపిడీ ఆగిపోయిందని చంద్రబాబు రక్తం మరుగుతోందా? అనేక సంక్షేమపధకాలను చూసి రక్తం మరుగుతోందా?`` అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు కాస్తా చందాల బాబుగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధి పోరాటం సమాజం కోసం పోరాటం చేస్తే చంద్ర‌బాబు పోరాటం తన జాతి కోసం అని ఆరోపించారు. ``గాంధీజీ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు ఉద్యమానికి ఎంతో తేడా ఉంది. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం గాంధీజీ అహింసాయుతంగా పోరాడితే ప్రజలు మద్దతిచ్చి పోరాడారు. ప్రజలు ముందుకొచ్చి బంగారం, డబ్బులు అందజేశారు. ఆ ఉద్య‌మానికి, ఈ ఉద్య‌మానికి ఎంతో తేడా ఉంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ 1947లో చనిపోయారు. కానీ 1950లో జన్మించిన చంద్రబాబు నాయుడు కూడా నాటి ఉద్యమాన్ని చూశానని చెప్పడం చూస్తుంటే మతిభ్రమించిందా అనే డౌట్ వ‌స్తోంది.`` అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు - పవన్ కల్యాణ్‌ లు మనుషులు మాత్రమే వేరని - మనసులు కలిసే ఉన్నాయని అమ‌ర్‌ నాథ్ అన్నారు. బీజేపీ ఎంపీ సుజనా చౌద‌రి స్కూల్ మారారు తప్ప పాత టీడీపీ సిలబస్ అనుస‌రిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. సుజనా చౌద‌రి తీగలాగితే చంద్రబాబు డొంక కదులుతుందని అమ‌ర్‌ నాథ్ పేర్కొన్నారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా సుజనా మాట్లాడార‌ని అమ‌ర్‌నాథ్ అన్నారు.