Begin typing your search above and press return to search.
చంద్రబాబుపై భారీ సెటైర్..
By: Tupaki Desk | 14 Sept 2015 4:56 PM ISTఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై భారీ సెటైర్ పడింది. ఇంతవరకు ఏ పార్టీవారు కానీ, ఏ నాయకుడు కానీ విమర్శించని యాంగిళ్లో చంద్రబాబును విమర్శించారు. ఏపీలో టీడీపీ చేపట్టిన చంద్రన్న రైతు యాత్రను నేపథ్యంగా తీసుకుని గుడివాడకు చెందిన వైసీపీ నేత అమర్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో పెను విమర్శలు, ఆరోపణలు ఏమీ లేకపోయినా నవ్వుకోవడానికి మాత్రం బాగా పనికొస్తున్నాయి.
టీడీపీ చేపట్టిన రైతు యాత్రకు చంద్రన్న రైతు యాత్ర అని పేరుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అమర్ నాథ్ వ్యంగ్య బాణాలేశారు. ''చంద్రన్న ఏంటి... తాత వయస్సులో ఉన్నాడు. అన్నా ఏంటి అన్నా" అంటూ ఎద్దేవా చేశారు. రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ తాత వయసులో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న కోసం చంద్రన్నగా ఇప్పుడు అవతారం ఎత్తినా ఎవరూ విశ్వసించరన్నారు.
విజయనగరలోని భోగాపురం విమానాశ్రయం భూసేకరణ పైన ధ్వజమెత్తారు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అని చెప్పి ఉత్తరాంధ్రలో గ్రీన్ ఫీల్డ్ లేకుండా చేస్తున్నారన్నారు. అన్ని మండలాల్లో భూముల విలువలను పెంచిన ప్రభుత్వం భోగాపురం వచ్చేసరికి ఎందుకు సవరించలేదన్నారు. రైతుల పొలాలు తీసుకుని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన గ్రామాలను వదిలి మిగతా గ్రామాల్లో భూమి సేకరించడం సమంజసం కాదని అమర్ నాథ్ అన్నారు.