Begin typing your search above and press return to search.
జగన్, రోజాలపై అమర్ నాథ్ షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 12 July 2017 12:49 PM GMTవైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి - టీడీపీ నేత అమర్ నాథ్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముందు రోజీ మందు తాగడం మానేయాలని ఘాటుగా విమర్శించారు. మంత్రులు అందరూ మందు బాబులు అన్న రోజా వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. 2014 ఎన్నికల్లో రుణమాఫీని వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు అవే హామీలు ఇస్తే రైతులు నమ్మరన్నారు. గత ఎన్నికల్లో జగన్ అతివిశ్వాసంతో వ్యవహరించారని, ఇప్పుడు ఆయనకు ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్ ఎన్ని పాద యాత్రలు చేసినా టీడీపీకి నష్టం లేదన్నారు.
రాబోయే ఎన్నికల్లో సీఎం కావడానికి జగన్ పాదయాత్ర చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందని అయ్యన్న పాత్రుడు అన్నారు. పాదయాత్రలు చేయడం వల్ల ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పుకొని పాదయాత్రలు చేయడమేమిటని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ ను తాము భయపడడం లేదరన్నారు. సలహాదారులను పెట్టుకునే వారికి చంద్రబాబును విమర్శించే స్థాయి, నైతిక హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ - రోజాలకు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదన్నారు.
విశాఖ భూకుంభకోణం విషయంపై ఆయన స్పందించారు. సిట్ నుంచి తనకు లేఖ అందినా, అందకపోయినా అధికారులకు సహకరిస్తానని చెప్పారు. తాను చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా అందిస్తానని చెప్పారు. కాగా, విశాఖ భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు రాజకీయ నాయకులకు లేఖలు రాశారు. మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుతో పాటు ప్రతిపక్ష నేత జగన్ - ఎంపీ విజయసాయిరెడ్డి - బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులకు లేఖలు రాశారు. విశాఖ భూకుంభకోణంపై ఆధారాలు ఏవైనా ఆధారాలుంటే తమకు అందజేయాలని అధికారులు కోరారు.