Begin typing your search above and press return to search.

మ్యాచ్ ఓడిపోతే బెడ్ రూమ్ నుంచి భ‌ర్త‌ని త‌రిమేస్తారా?

By:  Tupaki Desk   |   14 Nov 2022 11:34 AM GMT
మ్యాచ్ ఓడిపోతే బెడ్ రూమ్ నుంచి భ‌ర్త‌ని త‌రిమేస్తారా?
X
రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్ చూడబోతున్నాం. మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత ఒకేసారి వస్తున్నారు. "వాల్తేరు వీరయ్య" - "వీర సింహా రెడ్డి" వంటి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అయితే వీటి మధ్య రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన "వారసుడు" చిత్రాన్ని 2023 పొంగల్ బరిలో నిలుపుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే మరో తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ నటిస్తున్న "తునివు" సినిమాని కూడా పండుగకే రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు సినిమాలకు తమిళ్ లో పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు కానీ.. తెలుగులో మాత్రం గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా బాక్సాఫీసు ప్రత్యర్థులుగా భావిస్తున్న చిరంజీవి - బాలయ్య తలపడటం అనేది సినీ అభిమానులకు ఎల్లప్పుడూ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అందులోనూ తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి అంటే సినిమా పండుగగా భావిస్తుంటారు. అందులోనూ ఈసారి ఫెస్టివల్ కి మాస్ ని విపరీతంగా ఆకట్టుకునే ఇద్దరు సీనియర్ హీరోలు పోటీ పడుతుండటంతో మరింత ప్రత్యేకంగా చూస్తారు.

ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' 'వీర సింహా రెడ్డి' సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించినప్పటి నుంచి అందరి అటెన్షన్ వీటిపైనే ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" రేసు నుంచి తప్పుకోవడం కూడా కలిసొస్తుంది. ఇలాంటి టైంలో రెండు తమిళ్ డబ్బింగ్ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయటం సాహసమే అని చెప్పాలి.

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న "వారసుడు" చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలానే హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న "తునివు" సినిమాని కూడా ఎస్వీసీ సంస్థ ద్వారానే విడుదల చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. థియేటర్లు చేతిలో ఉన్నాయి కాబట్టి.. నిర్మాత డబ్బింగ్ చిత్రాలకే ఎక్కువ స్క్రీన్లు కేటాయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సంక్రాంతి - దసరా పండుగల సమయంలో విడుదలయ్యే స్ట్రెయిట్‌ చిత్రాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్‌ సినిమాలకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో దిల్ రాజు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ.. తొలి ప్రాధాన్యం తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్లకు సూచించింది.

దిల్ రాజు సొంత బ్యానర్ లో రూపొందే తమిళ డబ్బింగ్ చిత్రానికి ఎన్ని థియేటర్లు ఇస్తారని గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎన్ని స్క్రీన్లలో వచ్చినా చిరంజీవి - బాలకృష్ణ సినిమాల కారణంగా డబ్బింగ్ ఇబ్బందులు తప్పవని తెలుగు సినీ అభిమానుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ఉన్నప్పుడు సహజంగానే జనాలు వాటిని చూడటానికే ఆసక్తి కబరుస్తుంటారు. అందులోనూ ఈసారి అభిమానులు ఆశించే 'వాల్తేరు వీరయ్య' & 'వీర సింహా రెడ్డి' వంటి మాస్ కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. అలాంటప్పుడు డబ్బింగ్ చిత్రాలని పెద్దగా పట్టించుకోకపోవచ్చని అంటున్నారు.

ఒకవేళ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిరు - బాలయ్యల చిత్రాలకి తొలి రోజే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. సంక్రాంతి బరిలో ఉన్న రెండు డబ్బింగ్ చిత్రాల థియేటర్లు వెలవెలబోవడం ఖాయమని మెగా - నందమూరి ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల పలు డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనూ బాగా ఆడాయి కాబట్టి.. ఈసారి కూడా అదే రిపీట్ అవ్వొచ్చేమో అని ఓ వర్గం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తునన్నారు. మరి 2023 సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇకపోతే తమిళ్ లో రెండు భారీ చిత్రాల రిలీజులు ఉన్నప్పుడు తెలుగు డబ్బింగ్ సినిమాలకు పెద్దగా థియేటర్లు కేటాయించే అవకాశాలు చాలా తక్కువ. విజయ్ - అజిత్ లాంటి హీరోల సినిమాలు పోంగల్ కి వస్తున్నాయి కాబట్టి.. "వాల్తేరు వీరయ్య" & "వీర సింహా రెడ్డి" చిత్రాలకు అర కొర థియేటర్లు దొరకవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.