Begin typing your search above and press return to search.
అమెజాన్ అధినేత ని ముంచేసింది అతని ప్రియురాలేనా ... విస్తుపోయే నిజాలు !
By: Tupaki Desk | 25 Jan 2020 11:15 AM GMTఅమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం కొనసాగుతుండగానే ఇప్పుడు మరొక అంశం కొత్తగా వెలుగులోకి వచ్చింది. అసలు జెఫ్ బెజోస్ అతని భార్య విడిపోవడానికి కారణం బెజోస్ మరో మహిళతో నడుపుతున్న ప్రేమవ్యవహారమే కారణం అని ప్రపంచానికి తెలిసింది. జెఫ్ బెజోస్ మరో మహిళతో ప్రేమలో ఉన్న విషయం ఓ అంతర్జాతీయ పత్రికకు సమాచారం ఎలా వెళ్లిందనేదానిపైనే పై విచారణ జరగగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన భార్య మెకింజీతో గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విడాకులకు దారి తీసింది మాత్రం ఆయన ప్రేమ వ్యవహారమే. బెజోస్ ప్రేమిస్తున్న మహిళ లారెన్ శాంచెస్ అతనితో ఉన్న సంబంధం గురించి తన సోదరుడు మైఖేల్ శాంచెస్ గు చెప్పింది. అంతేకాదు వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్న సందర్భంలో చేసిన చాటింగ్ వివరాలను కూడా తన సోదరుడికి పంపింది. ఇదే అదనుగా తీసుకున్న మైఖేల్ నేషనల్ ఎంక్వైరర్ అనే ఓ అంతర్జాతీయ పత్రికకు డబ్బుల కోసం అమ్ముకున్నట్లు తెలుస్తుంది. భారీగా ఆ పత్రిక డబ్బులు ముట్టజెప్పడంతో వారి చాటింగ్ వివరాలను ఆ పత్రికకు ఇచ్చాడు. జెఫ్ బెజోస్ మరియు లారెన్ శాంచెస్‌ల మధ్య జరిగిన సంభాషణలను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ సమీక్షించింది. అయితే బెజోస్‌ను బ్లాక్ మెయిల్ చేసే దిశగా నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రయత్నాలు ఏమైనా చేసిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తన కథనంలో ప్రచురించింది.
ఇక బెజోస్ ఫోన్ హ్యాకింగ్ పై కూడా అమెరికా అటార్నీ కార్యాలయం విచారణ చేస్తోంది. 2018 మే 10వ తేదీన బెజోస్ మరియు లారెన్‌ల మధ్య జరిగిన సంభాషణలను గతేడాది జనవరి లో ఎంక్వైరర్ పత్రిక బయట పెట్టింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ వారి వ్యక్తిగత సంభాషణలను బయట పెట్టింది. ఇక 2018 జూలై 3వ తేదీన లారెన్ తన సోదరుడు మైఖేల్‌కు ఓ ఫోటోను పంపింది. అందులో జెఫ్ బెజోస్ ఒంటిపై చొక్కా లేకుండా అర్థనగ్నంగా ఉన్నాడు. ఇది కూడా ఎంక్వైరర్ ప్రచురించింది. 2019 ఫిబ్రవరి లో జెఫ్ బెజోస్ ఈ విషయంపై స్పందిస్తూ ఎంక్వైరర్ పత్రిక తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని చెప్పారు. తను లారెన్‌తో వ్యక్తిగతంగా ఉన్నసమయంలో ఫోటోలను బహిర్గతం చేస్తామంటూ ఆ పత్రిక తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని తెలిపారు.