Begin typing your search above and press return to search.
ఫోర్బ్స్ జాబితా: ప్రపంచ కుబేరుడు ఇతడే..
By: Tupaki Desk | 19 Jun 2018 9:19 AM GMTప్రపంచ కుబేరుల జాబితాను ప్రముఖ ఫోర్బ్ పత్రిక తాజాగా సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 141.9 బిలియన్ డాలర్ల సంపదతో అమేజాన్ రిటైల్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జెఫ్ బిజోస్ ప్రపంచంలోనే నంబర్ ధనవంతుడిగా నిలిచారు.
బిజోస్ సంపద ఈ జూన్ నెలలోనే భారీగా పెరిగింది. దాదాపు 5 బిలియన్ డాలర్ల పెరుగుదల నమోదైంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను బిజోస్ వెనక్కినెట్టి నంబర్ 1 ర్యాంకుకు చేరుకున్నాడు.. ప్రపంచంలో రెండో ధనవంతుడిగా బిల్ గేట్స్ నిలిచాడు. ఆయన సంపద విలువ 92.9 బిలియన్ డాలర్లు.
ఇక కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త వారెన్ బఫేట్ ఆస్తి కరిగిపోయింది. ఆయన 82.2 బిలియన్ డాలర్ల సంపాదనతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి పడిపోయాడు.
అమేజాన్ వ్యవస్థాపకుడు బిజోస్ ఈ ఏడాది మొదట్లోనే ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానానికి చేరుకున్నాడు. అమేజాన్ బిజినెస్ - ఆన్ లైన్ రిటైలింగ్ - వివిధ అనుబంధ వ్యాపారాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రపంచంలోని నంబర్ 1 కంపెనీ అయిన యాపిల్ తర్వాత రెండో అత్యుత్తమ కంపెనీగా అమేజాన్ నిలిచింది. ఇక అమెరికాలోని అగ్రశ్రేణి కంపెనీల్లో అమేజాన్ 2018 సంవత్సరంలో దాదాపు 177.87 బిలియన్స్ సంపదతో 8వ స్థానంలో నిలవడం విశేషం.