Begin typing your search above and press return to search.

అమెజాన్.. ద లార్జెస్ట్ ఆన్ లైన్ స్టోర్

By:  Tupaki Desk   |   25 Dec 2015 7:01 AM GMT
అమెజాన్.. ద లార్జెస్ట్ ఆన్ లైన్ స్టోర్
X
ఈ-కామర్స్ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటై అమెజాన్ ఇప్పుడు ఆ రంగంలో ఏకంగా బాహుబలిగా మారింది. ఇండియాలో అన్నిటికంటే అతిపెద్ద ఆన్ లైన్ స్టోర్ గా అవతరించింది. ఈ పరుగులో ఫ్లిప్ కార్ట్ - ఈబే వంటి పెద్ద సంస్థలను అధిగమించి టాప్ ప్లేస్ లో కూర్చుంది.

2015లో ఇంతవరు అమెజాన్ లో సగటున రోజుకు 55 వేల కొత్త ఉత్పత్తులను జోడించారట. 2015లో అత్యధికులు దర్శించిన ఈ కామర్స్ వెబ్ సైట్ గా అమెజాన్ అవతరించిందని ఆ సంస్థ తాజాగా ప్రకటన చేసింది. కాగా ఈ సైటును సందర్శించినవారిలో 70 శాతం మంది మొబైల్స్ లోనే చూశారట. 2015లో ఈ వెబ్ సైట్ ఆధారంగా విక్రయాలు చేపట్టిన అమ్మకందారుల సంఖ్య 250 శాతం పెరిగిందట.

ఇంకో విషయం ఏంటంటే సైట్ కు వచ్చిన ఆర్డర్లలో 65 శాతం టూ టైర్ సిటీల నుంచే వచ్చాయని తేలింది. దీని ప్రకారం ఈ కామర్స్ సామ్రాజ్యం నగరాలతో సమానంగా టూ, త్రీ టైర్ సిటీల్లో విస్తరించిందనడానికి అమెజాన్ ఉదాహరణగా నిలిచింది. తాజాగా ఇండియాస్ లార్జెస్ట్ ఆన్ లైన్ స్టోర్ గా అవతరించిన నేపథ్యంలో అమెజాన్ మరింత ఉత్సాహం చూపిస్తోంది. ఇండియాలో కొత్తగా గోదాములు నిర్మించి తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని చెప్తోంది.