Begin typing your search above and press return to search.
అమెజాన్ ఉద్యోగులకు తీరిక లేనంత పని.. బాటిళ్లలోనే మూత్రం
By: Tupaki Desk | 5 April 2021 6:30 AM GMTతీరిక లేనంత బిజీగా ఉన్నట్లుగా పలువురి నోట తరచూ వింటుంటాం. కానీ.. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందో అమెజాన్ వర్క్ షాపులో పని చేసే వారిని చూస్తే తెలుస్తుందంటున్నారు. బాత్రూంలోకి వెళ్లేందుకు సైతం తీరిక లేనంత బిజీగా ఉన్న వారు.. బాత్రూంకు కూడా వెళ్లలేనంత బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు.
పని చేసే చోట క్షణం తీరిక లేకపోవటంతో.. బాత్రూంకు అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తే వెళ్లలేని పరిస్థితి. దీంతో.. ప్లాస్టిక్ బాటిళ్లలో పట్టేస్తున్న దైన్యం ఉందన్న విమర్శలు వినిపించాయి. అయితే.. ఇలాంటివన్నీ తప్పేనని అమెజాన్ కొట్టిపారేసింది. ఈ విషయంలో నిజం ఎంతన్న దానిపై మీడియా ఫోకస్ చేయటంతో.. అమెజాన్ ఉద్యోగులు పడే కష్టాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. దీంతో.. అమెజాన్ ఆత్మరక్షణలో పడింది.
తొలుత తాము చెప్పిన మాటకు భిన్నంగా.. జరుగుతున్న తప్పును ఒప్పుసుకుంది. అంతేకాదు.. ఈ విషయాన్ని ప్రస్తావించిన సెనెటర్ మార్క్ పోకన్ కు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. దీంతో.. అమెజాన్ వర్కు షాపులో ఇన్ని కష్టాలా? అంటూ విస్మయానికి గురవుతున్నారు.