Begin typing your search above and press return to search.

ఎవరి సెంటిమెంట్లు అక్కర్లేదా అమెజాన్?

By:  Tupaki Desk   |   6 Jun 2016 4:45 AM GMT
ఎవరి సెంటిమెంట్లు అక్కర్లేదా అమెజాన్?
X
ప్రముఖ ఈ – కామర్స్ సంస్థ అమెజాన్ తీరుపై పలువురు హిందువులు మండిపడుతున్నారు. సదరు సంస్థ అనుసరిస్తున్న వైకరి కారణంగా తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటున్నట్లుగా వారు వాపోతున్నారు. తెలిసి చేశారో.. తెలియక చేశారో కానీ.. అమెజాన్ పై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా హిందూ దేవుళ్ల ఫోటోలున్న డ్యోర్ మాట్లను అమ్మకానికి పెట్టటం వివాదస్పదంగా మారింది. ప్రఖ్యాత ‘రాక్ బుల్’ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కిచెన్ వేర్ కు సంబంధించిన పలు వస్తువుల్ని అమెజాన్ వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టింది.

అలా అమ్మకానికి పెట్టిన వస్తువుల్లో డోర్ మ్యాట్ లపై హిందు దేవుళ్ల ఫోటోలు ఉండటం వివాదాస్పదమైంది. కాళ్లు తుచుకునే డోర్ మ్యాట్స్ మీద లక్ష్మీదేవి.. వినాయకుడు తదితర దేవుళ్ల చిత్రపటాలున్న డోర్ మ్యాట్స్ ను అమ్మకానికి పెట్టటంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ సెంటిమెంట్లను దెబ్బ తీసేలా ఉన్న డోర్ మ్యాట్ల ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వ్యవహారం వివాదాస్పదం కావటంతో స్పందించిన అమెజాన్ ఈ డోర్ మ్యాట్లను తన అమ్మకాల లిస్ట్ నుంచి తొలగించింది. హిందూ దేవుళ్లతో పాటు.. ఇస్లాం.. క్రైస్తవ మతస్తుల సెంటిమెంట్లు దెబ్బ తీసేలా కూడా కొన్ని డోర్ మ్యాట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆన్ లైన్లో అమ్మకానికి ఉంచే వస్తువులు ఎవరి మనోభావాల్నిదెబ్బ తీయకుండా ఉండాలన్నచిన్న విషయాన్ని అమెజాన్ ఎందుకు మిస్ అవుతున్నట్లు..?