Begin typing your search above and press return to search.
విడాకులు ఇచ్చి భార్యకు రికార్డు సృష్టించిన బెజోస్
By: Tupaki Desk | 3 Aug 2019 2:30 PM GMTజెఫ్ బెజోస్...అమెజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు. జెఫ్ బెజోస్ తన భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 25ఏళ్ల పాటు జీవనం సాగించిన ఈ జంట ఈ ఏడాది మొదట్లో విడిపోయారు. సంపదలోనే కాదు.. విడాకుల సెటిల్ మెంట్ విషయంలో కూడా బెజోస్ రికార్డు సృష్టించారు. అయితే, ఇప్పుడు ఆయన భార్య కూడా అదే తరహాలో మరో రికార్డు సృష్టించారు. విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్ అమెజాన్ షేర్లను జెఫ్ బెజోస్ మెకాంజీ పేరిట బదలాయించారు. దీంతో ఆమె ఫోర్బ్స్ సంపన్న మహిళగా నిలవడంతో.. పాటు విశ్వంలో ఉన్న సంపన్నుల జాబితాలో 23వ స్థానం దక్కించుకున్నారు.
కొద్దినెలల కింద జరిగిన విడాకుల ఒప్పందంతో మెకెంజీ జాక్ పాట్ కొట్టేసింది. జెఫ్ బెజోస్ తో విడాకుల డీల్ ఆమెను ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక మహిళల్లో ఒకరిని చేసింది. తన 62 బిలియన్ డాలర్ల ఆస్తిలో సగాన్ని భార్యకు భరణంగా చెల్లించారు జెఫ్ బెజోస్. కోర్టు ఆదేశాలతో.. అమేజాన్ షేర్స్ లో నాలుగో వంతు వాటా కూడా ఆమెకు దక్కింది. అయితే వీటిపై ఓటింగ్ కంట్రోల్ మాత్రం నిలుపుకున్నారు జెఫ్ బెజోస్. ఈ షేర్లతో కలిపి.. తాజాగా మెకెంజీ మొత్తం ఆస్తి.. 36.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.2లక్షల 60వేల కోట్లకు చేరిందన్నమాట.
విడాకుల భరణం కింద తొలుత మెకంజీకి 68 బిలియన్ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాషింగ్టన్‌లోని సీటెల్ కోర్టు న్యాయమూర్తి 37 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిర్చినట్లు తెలుస్తోంది. దీంతో కోటీశ్వరులైన మహిళల్లో ఆమె స్థానం సంపాదించుకుంది. ఫ్రాన్స్ బిలియనీర్ ఫ్రాంకోయిస్ బెట్టెన్‌కోర్ట్ మేయర్స్ 53.7 బిలియన్ డాలర్ల ఆర్జనతో మొదటి స్థానం దక్కించుకోగా... వాల్ మార్ట్ స్థాపకుడు సామ్ వాల్టన్ కూతురు అలిస్ వాల్టన్ రెండో స్థానాన్ని(50.4 బిలియన్ డాలర్లు) ఆక్రమించారు. 36.8 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ విజయం వెనుక మెకంజీ కీలక పాత్ర పోషించింది. 1992లో న్యూయార్క్ నగరంలోని హెడ్జిఫండ్ సంస్థ డి.ఈ.షాలో వీరు కలిసి పనిచేశారు. ఈ సంస్థకు జెఫ్ ఉపాధ్యక్షుడిగా ఉండగా.. మెకంజీ రీసెర్చి అసోసియేట్ గా పనిచేశారు. అక్కడ మొదలైన వీరి పరిచయం ఏడాది తర్వాత పెళ్లికి దారి తీసింది. 1993లో వివాహం చేసుకున్నారు. పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు తీసుకున్నామంటూ బెజోస్, మెకాంజీ ఈ ఏడాది ప్రారంభంలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్ తెలిపారు.