Begin typing your search above and press return to search.
ఎయిర్ టెల్ - అమెజాన్ మధ్య భారీ డీల్ ..!
By: Tupaki Desk | 6 Jun 2020 1:30 AM GMTభారతీ ఎయిర్ టెల్ లో వాటా కొనుగోలు కోసం అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ డాట్ కామ్ ఆసక్తి చూపిస్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. 2 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.15,000 కోట్లతో 5 శాతం వాటా దక్కించుకోవచ్చునని తెలుస్తోంది. భారతీ ఎయిర్‌టెల్, అమెజాన్ మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఒప్పంద నిబంధనల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చునని చెబుతున్నారు. ఎయిర్‌టెల్ లో అవసరమైతే 8 శాతం నుండి 10 శాతం వాటాను కూడా కొనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎంత మేర పెట్టుబడులు పెట్టాలి, అందులో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను అమెజాన్ పరిశీలిస్తోంది.
కానీ, ఈ డీల్ విషయంపై మాట్లాడేందేకు అమెజాన్, ఎయిర్ టెల్ నిరాకరిస్తున్నాయి. అయితే, ఈ డీల్ కుదిరితే మాత్రం, ఎయిర్ టెల్ కే బాగా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. భారత్‌లో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌కు 30 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఒక్కప్పుడు దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న ఈ టెలికం సంస్థ, రిలయన్స్ జియో ఎంట్రీ ఎఫెక్ట్‌తో ఎదురుదెబ్బలు చవిచూడాల్సి వచ్చింది.
దీంతో క్రమంగా మార్కెట్ వాటాను కోల్పోయి మూడోస్థానానికి పడిపోయింది. మరోవైపు రిలయన్స్ జియో ఈ మధ్య విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది. ఇప్పటికే ఫేస్ బుక్ సహా పలు అంతర్జాతీయ కంపెనీల ఇన్వెస్ట్ మెంట్లతో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో నిలదొక్కుకోవాలంటే, ఎయిర్ టెల్ కు అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీల పెట్టుబడుల ఎంతమైనా అవసరమనే చర్చ సాగుతోంది.