Begin typing your search above and press return to search.
అమెజాన్ చీఫ్ లాగ్ ఆఫ్ మాట పాటిస్తే బెటర్
By: Tupaki Desk | 19 Aug 2018 6:15 AM GMTనిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ ఒకటే ఉరుకులు.. పరుగులు. ఒత్తిడి జీవితం ఇప్పుడో అలవాటైంది. కొన్ని కాదనలేనికి.. కొన్ని కదిలించుకొని మరీ తెచ్చుకునేవి. రోజులన్నవి సంతోషంగా ఉండాలే కానీ సంక్లిష్టంగా ఉండకూడదు. ఎవరికి వారు.. తరచి చూసుకునే అవకాశం ఇప్పటి రోజుల్లో కనిపించని పరిస్థితి.
ఏ ఇద్దరు కలిసినా కొద్ది మాటల తర్వాత.. ఎవరి ఫోన్లతో వారు ఎంగేజ్ అయిపోతున్నారు. అది భార్యభర్తలే కాదు.. ప్రేమికులు కూడా. ఇదంతా ఒక ఎత్తు. నిత్యం అప్డేట్ కావటం అన్నది ఒక పెద్ద దురాశగా మారింది. నిత్యం అందరితో టచ్ లో ఉండటంతో పాటు..ఆఫీసు పనిని కూడా మోయటం అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. ఇదెంత మాత్రం మంచిది కాదని చెబుతున్న ఒక ప్రముఖుడి మాట చూస్తే.. దాన్ని ఫాలో కావటం బెటర్ అన్న భావన కలుగుతుంది.
ఇంతకీ ఆ ప్రముఖుడు ఎవరంటారా? ఈ కామర్స్ లో తోపు లాంటి అమెజాన్ ఇండియా చీఫ్ అమిత్ అగర్వాల్. వ్యక్తిగత జీవితాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య కాలంలో ఈమొయిల్స్ కు.. వర్క్ కాల్స్ కు స్పందించొద్దని ఆయన చూసిస్తున్నారు.
సిస్టమ్స్ ను టర్న్ ఆఫ్ చేయండి.. ఆఫీసు పనికి.. వ్యక్తిగత జీవితానికి మధ్య సమతూకం ఉండాలి. రెండూ అవసరమే కానీ.. ఆఫీసు పని మెరుగుపడాలంటే వ్యక్తిగత ప్రశాంతత చాలా అవసరం. ఇది దెబ్బ తినకుండా చూసుకోండన్న సలహా ఇస్తున్నారు. హైదరాబాద్.. బెంగళూరు.. చెన్నై.. ఫూణె.. ముంబయిలాంటి మెట్రో నగరాల్లో వేలమంది ఉద్యోగులు ఎక్కువ పని గంటలతో సతమతమవుతూ జీవితానందాన్ని కోల్పోతున్నట్లుగా అనేక సర్వేల్లో వెల్లడవుతోందని.. వారికొచ్చే మొయిల్స్ తో స్పందిస్తూ రేయింబవళ్లు గడిపేస్తున్నారన్నారు. తాజాగా తన మాటతో తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు అమిత్ చెప్పకనే చెప్పేశారన్న మాట వినిపిస్తోంది. అమెజాన్ ఇండియా చీఫ్ చెప్పిన మాటను ఎవరికి వారు వారి వ్యక్తిగత జీవితంలో ఎంతోకొంత ఫాలో కావాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.