Begin typing your search above and press return to search.

ఛీ..ఛీ.. ఫస్ట్ నైట్ రక్తం కారేందు కు అమెజాన్ ఉత్పత్తి

By:  Tupaki Desk   |   15 Nov 2019 6:15 AM GMT
ఛీ..ఛీ.. ఫస్ట్ నైట్ రక్తం కారేందు కు అమెజాన్ ఉత్పత్తి
X
ఇప్పుడు యాపారం ఆన్ లైన్ లో ఉపందుకొంది. గడప దిగకుండా.. ఉన్నచోటి నుంచి క్లిక్కుల తో కోరుకున్న వస్తువుల్ని తెప్పించుకునే పరిస్థితి. మారుతున్న అభిరుచి కి తగ్గట్లుగా.. భారీఎత్తున ఉత్పత్తులు ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. కొన్నిసందర్భాల్లో మార్కెట్లో ఎంతో వెతికితే కానీ దొరకని వస్తువులు సైతం ఒక్క క్లిక్ దూరం లో లభ్యమవుతున్నాయి. ఇలాంటి వేళ కొన్ని దరిద్రపు గొట్టు వస్తువులు సైతం ఆన్ లైన్ లో దొరికే పరిస్థితి.

ప్రఖ్యాత ఆన్ లైన్ పోర్టల్ అమెజాన్ తాజాగా అందుబాటు లోకి తెచ్చిన ఒక ప్రొడక్ట్ గురించి తెలిస్తే విస్మయం తో ముక్కున వేలేసుకోవటమే కాదు.. ఈ దరిద్రపు గొట్టు వస్తువులేందిరా బాబు అనుకోకుండా ఉండలేరు. అవాక్కు అయ్యేలా ఉండే ఈ ప్రొడక్ట్ షాకింగ్ గా మారింది. తొలిసారి సెక్స్ లో పాల్గొనే మహిళ యోని నుంచి రక్తం వస్తే.. ఆమె కన్య గా భావించే దరిద్రపు ఆచారం ఉంది.

డిజిటల్ యుగం లోనూ ఈ నమ్మకం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. మహిళల్లో కన్నెపొర (సాంకేతిక నామంలో ‘హైమన్’ పొరగా వ్యవహరిస్తారు. కొంతమంది అమ్మాయిల కు పుట్టుక తోనే ఈ పొర ఉండదు. కొందరి లో ఉన్నా.. వయసు ఎదిగే వేళ లో ఆడే ఆటల వల్ల కానీ ఇతర కారణాల తో పొర చిరిగి పోతుంది. తొలిసారి సెక్స్ చేసే సమయం లోనే కాదు.. కొంత మందికి తర్వాతి కాలంలో ఈ పొర చిట్లే అవకాశం ఉంటుంది) మీద ఉన్న నమ్మకాలు అన్ని ఇన్ని కావు.

తొలిసారి సెక్స్ చేసే వేళ లో రక్తం కారితే ఆమెను కన్య గా ఫీలయ్యేటోళ్లు చాలామంది ఉంటారు. మారిన కాలానికి తగ్గట్లు.. దీని పై ఉన్న నమ్మకాలు మారని దుస్థితి. ఆ మాటకు వచ్చే దీనికి సంబంధించి మన దేశం లోనే కాదు విదేశాల్లోనూ ఇలాంటి నమ్మకమే ఉంది. దీన్ని సొమ్ము చేసుకోవటానికి కొత్త తరహా యాపారానికి తెర తీశారు.

అమెజాన్ తాజా గా తెచ్చిన ఉత్పత్తి పేరు ఐ-వర్జిన్ - బ్లడ్ఫర్ ద ఫస్ట్ నైట్ (i-Virgin - Blood for the First Night) అనే ఉత్పత్తి ని ఆన్ లైన్ లో ఉంచింది. ఇందు లో నాణ్యమైన బ్లడ్ పవర్ ఉంటుందని.. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవంటున్నారు. దీన్ని తొలి రాత్రి వాడితే యోని నుంచి ఫేక్ బ్లడ్ కారుతుందని చెబుతున్నారు. ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలే తప్పించి.. ఇలాంటి ఉత్పత్తుల్ని వాడటం ద్వారా కొత్త అనుమానాలకు తెర తీయటం ఖాయం. అందుకే.. ఇలాంటి ఉత్పత్తుల్ని వాడే విషయంలో విచక్షణ చాలా అవసరమన్నది మర్చి పోకూడదు.