Begin typing your search above and press return to search.
పండుగ కిక్కు..తొలిరోజే రూ.750 కోట్లు
By: Tupaki Desk | 1 Oct 2019 9:47 AM GMTదేశంలో మందగమన ఛాయలు.. ఆర్థికమాంద్యం చుట్టుముట్టినా అవేవీ పండుగల వేళ పనిచేయవని తేటతెల్లమైంది. భారత దేశ వినియోగదారులు దసరా పండుగ భారీ ఆఫర్లకు ఎగబడ్డారు. పండుగ సీజన్ భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిపుచ్చుకున్నారు.
తాజాగా ప్రముఖ ఈకామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్కార్ట్ లు పండుగ వేళ సత్తా చాటాయి. ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు బిగ్ బిలియన్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివెట్ అంటూ 80శాతం వరకూ తగ్గింపు పండుగ ఆఫర్లు ప్రకటించారు. ఇందులో తొలిరోజు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్టు రెండు సంస్థలు తెలిపాయి.
అమేజాన్ తొలిరోజే రూ.750 కోట్ల విలువైన స్మార్ట్ పోన్లను విక్రయించామని.. కేవలం 36 గంటల్లోనే ఈ ఘనత సాధించినట్టు ప్రకటించింది. ఇక వాల్ మార్ట్ సొంతమైన ఫ్లిప్ కార్ట్ కూడా తొలిరోజు రెండు రెట్లు వృద్ధి సాధించామని తెలిపింది. 36 గంటల్లో శాంసంగ్, వన్ ప్లస్, ఆపిల్ స్మార్ట్ ఫోన్ల విక్రయాలతో అమ్మకాలు 750 కోట్ల రూపాయలు మించిపోయామని ప్రకటించింది.
ఇక ఇప్పటివరకూ ప్రారంభ రోజు కొనుగోళ్లలో ఇదే అతిపెద్ద అమ్మకాలని అమ్లేజాన్ ప్రకటించింది. ప్రధానంగా తమ అమ్మకాలు 91శాతం ద్వితీయ - తృతీయ శ్రేణి పట్టణాల నుంచే అమ్మకాలు జరిగాయని తెలిపింది. ఫ్యాషన్, ఫర్నిచర్, గ్రాసరీస్, బ్యూటీ విభాగాల్లో అమ్మకాలు జరిగాయని తెలిపింది.
ఇక అమేజాన్, ఫ్లిప్ కార్ట్ రెండు సంస్థలు 5 బిలియన్ డాలర్లకు మించి ఈ పండుగ సీజన్ లో అమ్మకాలు, ఆదాయం లక్ష్యంగా ముందుకెళుతున్నాయని సమాచారం. ఇక క్లబ్ ఫ్యాక్టరీ, స్పాప్ డీలు కూడా కూడా ఇలాంటి జోష్ నే కొనసాగిస్తున్నాయి.