Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ అడ్మిన్స్ కు షాకిచ్చిన అమెజాన్
By: Tupaki Desk | 20 July 2022 11:30 PM GMTమనం ఏదైనా కొనేముందు దాని రివ్యూలు, రేటింగ్ లు చూస్తాం.. ప్రొడక్ట్ డిమాండ్ ను రివ్యూలు నిర్దేశిస్తాయి. వాటిని బట్టే కొనుగోలు దారులు కొంటుంటారు. అయితే అమెజాన్ ప్రొడక్ట్స్ పై కొంతమంది కావాలనే ఫేక్ రివ్యూస్ పోస్టు చేస్తున్నట్టు కంపెనీ గుర్తించింది.
వ్యాపారాలు ప్రభావితం అయ్యేలా ఫేక్ రివ్యూలను ప్రచారం చేస్తున్న ఫేక్ ఫేస్ బుక్ గ్రూపులపై అమెజాన్ చట్టపరమైన చర్యలకు దిగింది. సొంత ప్రయోజనాల కోసం ఫేక్ రివ్యూలను చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి మోసగాళ్లను అడ్డుకోవడానికి .. ఆన్ లైన్ వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు పిటీషన్ ఒక మొదటి అడుగని కంపెనీ అభిప్రాయపడింది.
డబ్బు లేదా ఫ్రీ ప్రొడక్టులు పొందడానికి ఫేక్ న్యూస్, రివ్యూలను ప్రచారం చేస్తున్న ఫేస్ బుక్ అకౌంట్స్ పై చర్యలు తీసుకోనున్నట్లు అమెజాన్ కంపెనీ తెలిపింది. ఫేక్ రివ్యూలను చేయడానికి ప్రయత్నిస్తున్న 10వేల కంటే ఎక్కువ ఫేస్ బుక్ గ్రూపుల అడ్మిన్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పిటీషన్ దాఖలు చేసినట్టు అమెజాన్ మంగళవారం తెలిపింది.
చట్టపరమైన చర్యల ద్వారా అందిన సమాచారాన్ని ఉపయోగించి మోసగాళ్లను గుర్తిస్తామని.. వారు ప్రచారం చేసిన ఫేక్ రివ్యూలను తొలగిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ గ్రూపులు అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జపాన్ లలోని అమెజాన్ స్టోర్ లపై తప్పుదారి పట్టించే రివ్యూలను రాస్తున్నాయని గుర్తించారు.
మా టీంలు మిలియన్ల కొద్దీ అనుమానాస్పద రివ్యూలను కస్టమర్ లు చూడకముందే నిలిపివేస్తాయి. సోషల్ మీడియాలో ఆపరేట్ చేసే నేరస్థులను వెలికితీసేందుకు ఈ పిటీషన్ ముందడుగు. నిందితులను లక్ష్యంగా చేసుకొని చురుకైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెజాన్ తెలిపింది. మోసగాళ్లను జవాబుదారీగా ఉంచడం ద్వారా కస్టమర్లను రక్షించే అవకాశం ఉంటుంది. అటువంటి గ్రూప్స్ వెనుక ఉన్న మోసగాళ్లు కార్ స్టీరియోలు, కెమెరా ట్రైపాడ్ ల సహా వందలాది ప్రొడక్టులను ఉచితంగా పొందేందుకు ఫేక్ రివ్యూలను చేస్తారు అని తెలిపారు.
అమెజాన్ లో ఫేక్ రివ్యూలు సహా మోసం, దుర్వినియోగం నుంచి తమ స్టోర్ లను రక్షించడానికి, ప్రపంచవ్యాప్తంగా 12000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2020 నుంచి అమెజాన్, మెటా కంపెనీకి 10వేల కంటే ఎక్కువ ఫేక్ రివ్యూస్ లను గ్రూప్ ల గురించి రిపోర్ట్ చేసింది. వీటిలో మెటా పాలసీల ఉల్లంఘన కారణంగా సగానికి పైగా గ్రూప్ లను తొలగించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.