Begin typing your search above and press return to search.

హైదరాబాదు సిగలో అమెజాన్ మెరుపులు ఇవే

By:  Tupaki Desk   |   13 Sep 2019 4:34 PM GMT
హైదరాబాదు సిగలో అమెజాన్ మెరుపులు ఇవే
X
భారత దేశంలో హైదరాబాదుకు ఒక ప్రత్యేకత ఉంది. అత్యంత అనుకూల వాతావరణం - సాధారణ రియల్ ధరలు - స్థిరమైన ప్రభుత్వాలు... వీటన్నింటికి తోడు నైపుణ్యం ఉన్న మానవ వనరుల కారణంగా.. ఇండియాలో అంతర్జాతీయ సంస్థలకు మొదటి డెస్టినేషన్ గా మారుతోంది హైదరాబాదు. భారతదేశ నగరాల్లో ట్రాఫిక్ ను అధిగమించడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నగరమూ ఇదే. ఈ అనుకూలతలకు ఆకర్షితమైన మరో కంపెనీ అమెజాన్ అతిపెద్ద ఆఫీసును ఇక్కడ ఓపెన్ చేసింది. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

బిల్డింగ్ ప్రత్యేకతలు

9.5 ఎకరాలో విస్తరించింది ఉంది.

282 అడుగుల ఎత్తున్న ఈ స్కై టవర్ కెపాసిటీ 15000 మంది మ్యాన్ పవర్

ఈఫిల్ టవర్ కు వాడిన స్టీల్ కంటే 2.5 రెట్ల ఎక్కువ స్టీల్ దీని నిర్మాణంలో ఉపయోగించారు.

దీని కార్పెట్ ఏరియా... 65 ఫుట్ బాల్ స్టేడియంలతో సమానం.

290 కాన్ఫరెన్స్ రూములున్నాయి.

49 లిఫ్టులున్నాయంటే.. ఎంత సౌకర్యవంతంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు.

ప్రేయర్ గది నుంచి స్నానపు గదుల వరకు ఇందులో లేనిది ఏముండదు. సకల జీవన వైవిధ్యాలకు కేంద్రంగా నిర్మించారు.

8.5 లక్షల లీటర్ల కెపాసిటీతో నడిచే వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ ఉంది

ఈ అమెజాన్ ఆఫీసు ప్రత్యకతలు

ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ కార్యాలయం

అమెరికా కాకుండా ఇతర దేశాల్లో ఇంత విశాలంగా కట్టింది ఇక్కడే.

24 గంటల కెఫెటేరియా సిబ్బంది కోసం ఓపెన్ చేసే ఉంటుంది.

హైదరాబాదులో అమెజాన్ కి ఇది రెండో భవనం. మొదటి భవనం ఎయిర్ పోర్టులో ఉంది. కాకపోతే అది ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్.

యుఎస్ కు చెందిన రెండు అతిపెద్ద కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్ - అమెజాన్ లకు రెండింటికీ అమెరికా తర్వాత ఇంత పెద్ద కార్యాలయం హైదరాబాదులో మాత్రమే ఉంది.