Begin typing your search above and press return to search.

దుబాయ్ సముద్రంలో రూ.630 కోట్లతో ఖరీదైన విల్లా కొన్న అంబానీ

By:  Tupaki Desk   |   27 Aug 2022 10:30 AM GMT
దుబాయ్ సముద్రంలో రూ.630 కోట్లతో ఖరీదైన విల్లా కొన్న అంబానీ
X
ఆసియాలోనే రెండో అత్యంత ధనవంతుడు.. భారత నంబర్ 1 కుబేరుడు ముఖేష్ అంబానీ దుబాయ్ లో ఉన్న ప్రపంచంలోనే అంత్యంత విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశాడు. సముద్రంలో ఉండే పామ్ జుమేరా దీవుల్లో సుమారు 80 మిలియన్ డాలర్లు( రూ.630 కోట్లు) వెచ్చించి మరీ ఈ ఇంటిని కొన్నట్టు తెలిసింది. పామ్ జుమేరా ఉత్తర భాగంలోని బీచ్ సైడ్ లో ఉన్న ఈ విల్లాలో ఏకంగా 10 బెడ్ రూంలు, ఒక స్పా, ఇండోర్, ఔట్ డోర్ ఫూల్స్ ఉన్నట్లు దుబాయ్ లోకల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

పామ్ జుమేరా.. దుబాయ్ సమీపంలోని సముద్రంలో నిర్మించిన కృత్రిమ దీవులు ఇవీ.. ఈత చెట్లను పోలిన ఈ కృత్రిమ దీవుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలను దుబాయ్ ప్రభుత్వం నిర్మించింది. సకల సౌకర్యాలు కల్పించింది. ఈ విల్లాలో ఒక దాన్ని ముకేష్ కొనేశారు. ఈ ఏడాది ఆరంభంలో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ కోసం కొనుగోలు చేసినట్లు బ్లూంబర్గ్ తెలిపింది.

ప్రపంచ కుబేరులు, సెలబ్రెటీలు దుబాయ్ ను తమ ఫేవరేట్ డెస్టినేషన్ గా ఎంచుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వం ‘గోల్డెన్ వీసా’ వంటి ఆఫర్లను పెడుతుండడంతో రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది

అనంత్ కోసం ముకేష్ అంబానీ కొన్న విల్లాకు సమీపంలోనే బ్రిటీష్ ఫుట్ బాలర్ డేవిడ్ బెక్ హామ్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఇళ్లు ఉండడం గమనార్హం.

రిలయన్స్ ను దేశంలోనే నంబర్ 1 సంస్థగా ముఖేష్ తీర్చిదిద్దారు. అయితే ఆయన రిటైర్ మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారాలను విభజించి ఇద్దరు కుమారులు, కూతురుకు సమంగా పంచారు. వారే ఇప్పుడు చూసుకుంటున్నారు. రిలయన్స్ జియోకు ఆకాష్ ను చైర్మన్ చేశారు. ఈకామర్స్,రిటైల్ లను ఈషా అంబానీకి ఇచ్చారు. అనంత్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ను అప్పగించనున్నారు. పెట్రో కెమికల్స్ రంగానికి చెందిన వ్యాపారం కావడంతోనే అనంత్ కోసం దుబాయ్ లో విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో రిలయన్స్ పెట్రో వ్యాపారాల కోసం అనంత్ యూఏఈ, సౌదీ వస్తే ఇబ్బందులు లేకుండా ఈ విల్లాను కొన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే యూకేలో అంబానీ ఫ్యామిలీకి రూ.600 కోట్లతో ఒక మాన్షన్ రాజబంగ్లా ఉంది. ముఖేష్ ముచ్చటపడి ఈ ఎస్టేట్ ను కొన్నాడు. ఇక ఈషా కోసం న్యూయార్క్ లో కూడా అధునాతన భవంతిని కొన్నారు. ఎవరి వ్యాపారాలకు తగ్గట్టుగా ఆ దేశాల్లో వారసుల కోసం ముఖేష్ ఖరీదైన ప్రాపర్టీలను కొని పెట్టడం విశేషం.

ఇక దుబాయ్ విల్లాను సెక్యూరిటీ కోసం భారీ మార్పులు చేయబోతున్నారట.. దీని కోసం మరికొన్ని కోట్లు ఖర్చు చేసి మాడిఫై చేయబోతున్నారట.. ప్రస్తుతానికి అంబానీ ఫ్యామిలీ ముంబైలోని అంటలియోలోనే ఉంటోంది.