Begin typing your search above and press return to search.
అంబానీ కారంటే ఆమాత్రం ఉండాల్సిందే..! అపరకుబేరుడి కొత్తకారు వివరాలివే..!
By: Tupaki Desk | 7 March 2021 4:30 PM GMTమామూలు వ్యక్తులు కూడా కార్లలో తిరుగుతున్న రోజులివి. ఇక అంబానీ లాంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కొనుగోలు చేసే కార్లు ఓ రేంజ్లో ఉంటాయి. సకల సౌకర్యాలు, దర్జా, దర్పం ఉండేలా చూసుకొని వాళ్లు కార్లను కొనుగోలు చేస్తున్నారు. మనదేశ అపర కుబేరుడు అంబానీ ఓ కొత్త కారు కొనుగోలు చేశాడు.
ఈ ఏడాది ఆరంభంలోనే ఆయన మూడు విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశారు. తాజాగా మరో కారు ఆయన గ్యారేజ్‌లోకి వచ్చి చేరింది. ప్రస్తుతం అంబానీ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కల్లిసన్ బ్లాక్ బ్లాడ్జ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు అత్యంత విలాసవంతమైందే కాక.. భద్రత పరంగా కూడా ఎంతో మెరుగైంది.
2018లో భారత్‌కు తెచ్చిన రోల్స్ రాయిస్ కల్లసన్కు మరిన్ని మెరుగులు దిద్ది కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌గా తీసుకొచ్చారు. దీన్ని 2020లో విడుదల చేశారు. రెండు కల్లినన్ మోడళ్లను కొనుగోలు చేసిన తొలి భారతీయుడు ముకేశ్ అంబానీయే కావడం గమనార్హం. బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ ధర రూ. 8.20 కోట్లు.. అయితే ఈ కారు ఆన్‌రోడ్ కు వచ్చేసరికి రూ. 10 కోట్లు అవుతుందని సమాచారం. అయితే అంబానీ తన ప్రతి కారుకు తనదైన స్టయిల్లో కొన్ని మార్పులు చేసుకుంటారు. సో ఈ కారుకు కూడా కొన్ని అదనపు హంగులు చేరిస్తే ధర మరింత పెరుగనున్నది.
ఫీచర్స్ ఇవే..
6.75 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్విన్-టర్బో వీ 12 ఇంజన్ తో ఉంటుంది. బేసిక్ కల్లినన్‌తో పోల్చితే ఈ కారు మరింత పటిష్ఠమైంది. గరిష్ఠంగా 592 హెచ్‌పీ శక్తిని, 900 ఎన్‌ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది. గంటకు 100 కి.మీ వేగాన్ని కేవలం 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. ఎడారి, కొండ, బురద లాంటి ప్రాంతాల్లో కూడా సులభంగా దూసుకెళ్తుంది. అంబానీ కొత్తకారుకు సంబంధించిన సమాచారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అంబానీ లాంటి అపర కుబేరుడు రూ. 10 కోట్లు పెట్టి కారు కొనుగోలు చేయడంలో వింతేమంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంబానీ కారంటే ఆ మాత్రం ఉండాలిలే.. అంటూ మరికొందరు సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.