Begin typing your search above and press return to search.
ఆశ్చర్యానికి గురి చేసే అంబానీ కారు.. దాని ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 14 April 2021 1:30 AM GMTఅంబానీ అది పేరు కాదు ఓ బ్రాండ్. భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ. ఈయన కుటుంబానికి జడ్ ప్లస్ క్యాటగిరీ ఉంటుంది. అలాంటి అంబానీ ఏది చేసినా పెద్ద వార్తే అవుతుంది. ఆయన ఉండే ఇల్లు, ఇంట్లోని వస్తువులు, తిరిగే కార్లు ప్రతీది ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఇక అంబానీ రోజూ తిరిగే కారు ధర, దాని ప్రత్యేకతలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
అంబానీ ఇంట్లోని గ్యారేజీలో ప్రపంచంలోని టాప్ మోడల్ కార్లు ఉంటాయి. ఆయన మాత్రం రోజూ Mercedes G63 AMG లోనే ప్రయాణిస్తారు. ఆయన వాడే కారు ధర రూ.10 కోట్లు. రేటుకు తగ్గట్లే అత్యంత భద్రతతో ఈ కారును రూపొందించారు. ఈ కారును బెంజ్ తయారు చేసింది. ఆయన భద్రత విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు కోసం మెర్జిడెస్ బెంజ్ చాలా కృషి చేసింది. ఎటువంటి ప్రమాదాన్నైనా తట్టుకునేలా అండర్ బాడీని పటిష్ఠంగా రూపొందిచారు. దీనికోసం చాలా విలువైన మెటీరియల్ ను ఉపయోగించారు. భద్రత కోసం అద్దాల లోపల పాలీకార్పొనేట్ ఉపయోగించారు. రీఇన్ ఫోర్స్డ్ స్టీల్ తో బాడీని తయారుచేశారు. లోపల ప్రత్యేకమైన స్టీల్ ను వాడారు.
రెండు మీటర్ల దూరం నుంచి కాల్చినా ప్రమాదం జరగకుండా భద్రతతో ఈ కారును తయారు చేశారు. 15 కేజీల టీఎన్జీ బ్లాస్టింగ్ నైనా తట్టుకునేలా డిజైన్ చేశారు. ఈ కారు బరువు 4.7 టన్నులు ఉంటుంది. దానికి తగినట్లుగానే ఇంజిన్, బ్రేకులు, యాక్సిలేటర్ ఏర్పాటు చేశారు. 200 కేజీల బరువును మోయగలదు. 190 కంటే మించని వేగంతో ఈ కారులో ప్రయాణించాలి. ఆయన కారు ధరే కాదు అందులోని ప్రత్యేకతలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి కదా. అంబానీ కారు అంటే ఈమాత్రం భద్రతా ఉండాలి మరి.!