Begin typing your search above and press return to search.

ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ‘ఆంటిలియా..’..!

By:  Tupaki Desk   |   30 Dec 2022 4:57 AM GMT
ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ‘ఆంటిలియా..’..!
X
అపర కుబేరుడు.. పారిశ్రామిక దిగ్గజం.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట మరోసారి పెళ్లి బాజా మోగబోతుంది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఎన్ కోర్ హెల్త్ సీఈవో వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ తో వివాహం ఖాయమైంది. ఈమేరకు గురువారం రాజస్థాన్ లోని నథడ్వారా శ్రీనాథ్‌ జీ దేవాలయంలో అనంత్-రాధికల నిశ్చితార్థం వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెల్సిందే..

అనంత్ అంబానీ తన స్నేహితురాలైన రాధిక మర్చంట్ ను వివాహం చేసుకోబోతుండటం విశేషం. అనంత్ కు ఆమె కొన్నేళ్ల కిందట పరిచయమైంది. వీరివురు తమ వ్యాపారాలు చురుకుగా పాల్గొంటూనే ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నారు. వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే వీరిద్దరు వివాహ జీవితంలోకి త్వరగా అడుగు పెట్టబోతున్నారు.

అంబానీ పెద్ద కుమార్ ఆకాశ్ అంబానీ శ్లోకా మెహతా వివాహ వేడుక సమయంలోనే రాధికా మర్చంట్‌ పేరు పాపులర్ అయింది. ఈ వేడుకల్లో అనంత్-రాధికలు సన్నిహితంగా మెలగడంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే ప్రచారం జరిగింది. భారత నాట్యంలో శిక్షణ పొందిన రాధికతో అంబానీ కుటుంబం ఘనంగా అరంగేట్రం చేయించింది.

అతిరథ మహారథుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఆమెకు సంబంధించిన భరతనాట్యం వీడియోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి. అంబానీ కుటుంబానికి రాధిక బాగా నచ్చడంతో రాధికను తన చిన్న కోడలిగా చేసుకునేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి అనంత్-రాధికల నిశ్చితార్థం కుటుంబ సభ్యులు.. సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

అనంత్-రాధికల నిశ్చితార్థం ఖరారైన నేపథ్యంలో అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే అంబానీ ఎంతో ఇష్టంతో కట్టుకున్న ముంబైలోని ఆంటిలియా ప్యాలెస్ అద్భుతంగా ముస్తాబైంది. అంబానీ ఇంటి డెకరేషన్ చూస్తుంటే ఇంద్రభవనమే భూమిపై వెలిసిందా? అన్నట్లుగా మారిపోయింది.

ముంబైలో ఆంటిలియాకు వెళ్లే దారి మొత్తం విద్యుద్దీపాలతో సుందరంగా అలకరించబడింది. దీంతో అటు వైపు వెళ్లే బాటసారులు అంబానీ ఇంటి ధగధగలు చూసి అవాక్కవుతున్నారు. మరోవైపు అనంత్-అంబానీ పెళ్లి తేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే దీనిపై అంబానీ కుటుంబం అధికారిక ప్రకటన చేసే అవకాశం కన్పిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.