Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్‌ టాప్‌-100 రిచ్ లిస్టులో ఈసారీ అంబానీకే కిరీటం

By:  Tupaki Desk   |   8 Oct 2021 3:37 AM GMT
ఫోర్బ్స్‌ టాప్‌-100 రిచ్ లిస్టులో ఈసారీ అంబానీకే కిరీటం
X
దేశీయంగా సంపన్నుల జాబితాను తాజాగా ఫోర్బ్స్‌ టాప్‌-100 రిచ్ లిస్టు పేరుతో విడుదలైంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానికి మొదటిస్థానం దక్కగా.. రెండో స్థానంలో గౌతమ్ ఆదానీ నిలిచారు. రిచ్ లిస్టులో ముకేశ్ అంబానీ మొదటిస్థానంలో నిలవటం వరుసగా ఇది పద్నాలుగో సారి. ఆయన ఆస్తి మొత్తం రూ.6.86 లక్షలు కోట్లుగా తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయన ఆస్తి ఏకంగా 400 కోట్ల డాలర్ల మేర పెరిగినట్లుగా తేల్చారు.

ఇదిలా ఉంటే ఈ జాబితాలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆస్తి రూ.5.53 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఆయన రెండోస్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే.. టాప్ 100 రిచ్ లిస్టులో తెలుగోళ్లు ఐదుగురికి చోటు లభిస్తే.. మొత్తం టాప్ వందలో ఆరుగురు మహిళలు ఈ చోటును సొంతం చేసుకున్నారు. గత జాబితాతో పోలిస్తే ఈ ఏడాది జాబితాలో కొత్తగా ఆరుగురికి చోటు లభిస్తే.. పదకొండు మంది ఈసారి జాబితా నుంచి మిస్ కావటం గమనార్హం.

ఇదంతా ఒక ఎ్తు అయితే.. గత ఏడాది కాలంలో ఫోర్బ్స్‌ కుబేరుల మొత్తం సంపద భారీగా పెరిగింది. గత ఏడాది 25,700 కోట్ల డాలర్ల నుంచి ఏడాది యాభై శాతం పెరిగి 77,500 కోట్లకు పెరిగింది. మన రూపాయిల్లో చెప్పాలంటే ఇది రూ.57.35 లక్షల కోట్లకు సమానంగా చెప్పాలి.

దేశంలో సంపన్నుడిగా ముకేశ్ అంబానీ నిలిస్తే.. మహిళల విషయానికి వస్తే దేశంలో అత్యంత సంపన్న మహిళగా ఓపీ జిందాల్ గ్రూప్ గౌరవ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. రూ.1800 కోట్ల డాలర్ల ఆస్తితో ఆమె టాప్ టెన్ జాబితాలో కూడా నిలవటం విశేషం. ఈ లెక్కలన్ని కూడా సెప్టెంబరు 17న స్టాక్ మార్కెట్లోని షేర్ల ధరల ఆధారంగా లెక్కించినట్లుగా చెబుతున్నారు.

ఫోర్బ్స్‌ టాప్‌-100 రిచ్ లిస్టులో టాప్ 10 ఎవరంటే..

ర్యాంక్ పేరు కంపెనీ పేరు ఆస్తి (కోట్ల డాలర్లు)

01 ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 9270
02 గౌతమ్ అదానీ అదానీ గ్రూపు 7480
03 శివ్ నాడార్ హెచ్ సీఎల్ 3100
04 రాధాకిషన్ దమానీ డిమార్ట్ 2940
05 సైరస్ పూనావాలా సీరమ్ ఇన్ స్టిట్యూట్ 1900
06 లక్ష్మీ నివాస్ మిట్టల్ ఆర్సెలార్ మిట్టల్ 1880
07 సావిత్రి జిందాల్ ఓపీ జిందాల్ గ్రూప్ 1800
08 ఉదయ్ కొటక్ కోటక్ గ్రూపు 1650
09 పల్లోంజీ మిస్త్రీ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపు 1640
10 కుమార్ బిర్లా ఆదిత్య బిర్లా గ్రూపు 1580

టాప్ 100లో తెలుగు సంపన్నులు ఎవరు? వారికొచ్చిన ర్యాంకు ఎంతంటే?

ర్యాంక్ పేరు కంపెనీ ఆస్తి(కోట్ల డాలర్లు)

19 మురళి దివి దివీస్ ల్యాబ్స్ 990
69 రెడ్డీస్ ఫ్యామిలీ డాక్టర్ రెడ్డీస్ 301
79 పిచ్చి రెడ్డి మెగా 273
88 ప్రతాప్ సీ రెడ్డి అపోలో హాస్పిటల్స్ 253
90 పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి అరబిందో 245

టాప్ 100లో మహిళలు సాధించిన ర్యాంకు.. వారికున్న సంపద ఎంతంటే?

ర్యాంకు పేరు కంపెనీ ఆస్తి (కోట్ల డాలర్లు)

07 సావిత్రి జిందాల్ ఓపీ జిందాల్ 1800
24 వినోద్ రాయ్ గుప్తా హోవెల్స్ 760
43 లీనా తివారీ యూఎస్ వీ 440
47 దివ్య గోకుల్ నాథ్ బైజూస్ 405
53 కిరణ్ మజుందార్ షా బయోకాన్ 390
73 మల్లికా శ్రీనివాసన్ టాఫే 289