Begin typing your search above and press return to search.
ప్రపంచ కుబేరుల జాబితాలో 8 వ స్థానంలో అంబానీ .. బిలియనీర్ల లిస్ట్ లో కొత్తగా 50 మంది ఇండియన్స్ !
By: Tupaki Desk | 2 March 2021 1:30 PM GMTహరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 జాబితా తాజాగా విడుదల అయింది. ఆ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ ఐఎల్) అధిపతి ముఖేష్ అంబానీ 2021 హురున్ ప్రపంచ కుబేరుల జాబితాలో రూ రూ 6.09 లక్షల కోట్ల సంపదతో ఎనిమిదవ స్ధానంలో నిలిచారు. గత ఏడాదితో పోల్చితే ముఖేష్ ఆస్తుల విలువ 24 శాతం పైగా పెరిగింది. ఇదే జాబితాలో గౌతం అదానీ రూ 2.34 లక్షల కోట్ల సంపదతో 48వ స్థానంలో నిలవగా రూ 1.94 లక్షల కోట్ల ఆస్తులతో శివనాడార్ ఆయన కుటుంబం 58వ స్ధానంలో నిలిచింది. మరోవైపు స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ రూ 1.4 లక్షల కోట్ల సంపదతో హురున్ ప్రపంచ కుబేరుల జాబితాలో 104వ స్ధానం దక్కించుకున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రమైన పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా రూ 1.35 లక్షల కోట్ల ఆస్తులతో 113వ ర్యాంక్ సాధించారు. ఇక బిలియనీర్ల క్లబ్ లో కొత్తగా 50 మంది భారతీయలు చేరడం విశేషం.
భారత్ లో ప్రస్తుతం 209 మంది బిలియనీర్లు ఉండగా వారిలో 117 మంది భారత్‌లో నివసిస్తున్నారు. ఇక అమెరికాలో 689 మంది బిలియనీర్లు ఉన్నారు. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ హురున్ 19700 కోట్ల డాలర్ల ఆస్తులతో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్ డాలర్లు ఎగబాకింది. ఇక అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్లు, ఎల్ వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 114 బిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 110 బిలియన్ డాలర్లు, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ 101 బిలియన్ డాలర్లతో వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.