Begin typing your search above and press return to search.
త్వరలోనే దేశవ్యాప్తంగా 5జీ సేవలు:అంబానీ
By: Tupaki Desk | 9 Oct 2020 1:30 AM GMTకర్లో దునియా ముఠ్ఠీమే అంటూ....చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. ఆ తర్వాత జియో జీ భర్ కే అంటూ కారు చౌకగా మొబైల్ డేటాతో పాటు ఫోన్ ను సామాన్యులకు అందించారు. ఈ తర్వాత 4జీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఇదే ఊపులో కొంతకాలంగా సొంతగా 5జీ సొల్యూషన్స్ ను డెవలప్ చేస్తోన్న జియో తాజాగా ఆ సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రపంచ స్థాయి సేవల్ని అందించే విధంగా 5జీ టెక్నాలజీని రూపొందించామని, దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. 5జీ సాంకేతికతను దేశంలోనే అభివృద్ది చేశామని, జియో 5జీని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ‘ఆత్మనిర్భర భారత్’ కు అంకితం ఇస్తున్నామని అంబానీ అన్నారు. టీఎం ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020’ వర్చువల్ భేటీలో పాల్గొన్న అంబానీ జియో ప్రస్ధానాన్ని వివరించారు.
జియో రాక ముందు భారత్ ల కేవలం 2జీ టెక్నాలజీమాత్రమే ఉందని, ఆ తర్వాత రిలయన్స్ డిజిటల్ విప్లవం ప్రజల్లోకిదూసుకుపోయిందని అంబానీ అన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను మెరుగైన సేవలు, ఉచిత వాయిస్ కాల్స్ అందించామన్నారు. 2016లో జియో ప్రారంభించే నాటికి డేటా వినియోగంలో 155వ స్ధానంలో ఉన్న భారత్...ఆ తర్వాత అనతికాలంలోనే తొలి స్థానం కైవసం చేసుకుందని అన్నారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియోలో చేరారని, జియో వచ్చాక నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినియోగం జరుగుతోందన్నారు. మూడేళ్లలోనే 4జీ నెట్‌వర్క్‌ను జియో ఏర్పాటు చేసిందని, 2జీ నెట్‌వర్క్ నిర్మాణం కోసం మిగతా కంపెనీలకు పాతికేళ్లు పట్టిందని అన్నారు. 4జీతో హైస్పీడ్ నెట్, చౌక ఫోన్లు అందుబాటులోకి తెచ్చామని, అదే తరహాలో త్వరలోనే 5జీ సేవలను భారత్ లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అంబానీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆపరేటర్లకు జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా జియో 5జీని ఎక్స్‌పోర్ట్ చేస్తామని, 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే యూజర్లకు జియో 5జీ సేవలు లభించనున్నాయని చెప్పారు.