Begin typing your search above and press return to search.

అంబానీ సంప‌ద‌.. రికార్డు స్థాయి రేంజ్ కు!

By:  Tupaki Desk   |   7 Sept 2021 10:29 AM IST
అంబానీ సంప‌ద‌.. రికార్డు స్థాయి రేంజ్ కు!
X
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ చైర్మ‌న్ ముకేష్ అంబానీ సంప‌ద‌లో భారీ గ్రోత్ చోటు చేసుకుంటోంది. ఈ మేర‌కు బ్లూమ్ బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ రిపోర్ట్ చేస్తోంది. అంబానీ సంప‌ద గ‌త వారం రోజుల్లోనే దాదాపు 16 బిలియ‌న్ డాల‌ర్ల మేర‌కు పెరిగింద‌ని ఈ సంస్థ అంచ‌నా వేసింది. దీంతో అతి త్వ‌ర‌లోనే అంబానీ సంప‌ద 100 బిలియ‌న్ డాల‌ర్ల మార్కును చేర‌వ‌చ్చ‌ని కూడా అంచ‌నా వేసింది. గ‌త కొన్ని రోజులుగా అంబానీ షేర్ల విలువ రికార్డు ధ‌ర పెర‌గ‌డంతో ఈ మేర‌కు ఆయ‌న ఆస్తి విలువ కూడా భారీగా పెరుగుతోంద‌ట‌.

ప్ర‌స్తుతం అంబానీ మొత్తం సంప‌ద విలువ 92.6 బిలియ‌న్ డాల‌ర్లు అని బ్లూమ్ బ‌ర్గ్ పేర్కొంది. ఇందులో 16 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలో పెరిగిందే. ఇదే పెరుగుద‌ల ఇలాగే కొన‌సాగుతుంద‌ని అంచ‌నా. దీంతో అతి త్వ‌ర‌లో అంబానీ సంప‌ద విలువ 100 బిలియ‌న్ డాల‌ర్ల మొత్తానికి చేరుతుంద‌ట‌.

ప్ర‌స్తుతం అంబానీ ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంప‌న్నుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడ‌ని ఆ సంస్థ పేర్కొంది. అదే ఆసియా విష‌యానికి వ‌స్తే అంబానీనే నంబ‌ర్ వ‌న్ సంప‌న్నుడిగా ఉంటారు. ప్ర‌స్తుతం ముకేష్ అంబానీ వ‌య‌సు 64 సంవ‌త్స‌రాలు. జియోతో అద్భుతాలు చేశారీయ‌న‌. అలాగే ఈ మ‌ధ్య‌నే వాటాల అమ్మకం ద్వారా బ్యాంకు అప్పుల‌ను కూడా బాగా తీర్చార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

త్వ‌ర‌లోనే జియో ఒక అఫార్డ‌బుల్ ఫోన్ ను కూడా విడుద‌ల చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆర్ఐఎల్ షేర్ల డీల్స్ పాజిటివ్ గా సాగుతున్నాయి.