Begin typing your search above and press return to search.
అదిరిపోయే ఫీచర్స్ తో అంబాసిడర్ 2.0.. మార్కెట్‌లోకి ఎప్పుడంటే!
By: Tupaki Desk | 27 May 2022 4:30 PM GMT'బెంజ్ అందరు బాగుందంటారు పూరి.. కానీ అంబాసిడరే కొంటారు' అని ఓ సినిమాలో డైలాగ్ ఉన్నట్లు.. అంబాసిడర్ కారు గొప్పదనం అలాంటింది. మధ్య తరగతి వాళ్లకు కారు అందని ద్రాక్ష.. కానీ వారు కూడా కారులో లగ్జరీగా తిరిగే అవకాశం అంబాసిడర్‌తోనే కలిగింది.
ఒకప్పుడు కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్‌గా ప్రఖ్యాతి గాంచింది అంబాసిడర్ కారు. కానీ 2014 నుంచి ఈ కార్ల తయారీ ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు సరికొత్త రూపు తో.. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో.. ప్రో వెర్షన్‌లో అంబాసిడర్ కారు మార్కెట్‌లోకి రాబోతోంది. అంబాసిడర్ ఫ్యాన్స్.. ఆర్ యూ రెడీ టూ డ్రైవ్ అంబాసిడర్.
ఒకప్పుడు భారతీయ రహదారులను దున్నేసిన అంబాసిడర్ కారు అతి తక్కువ సమయంలోనే వాహన ప్రియుల మనసు దోచేసింది. విదేశీ కార్లపై మోజు అంబాసిడర్ అమ్మకాలపై పడింది. అందుకే 2014లో హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కార్ల తయారీ ఆపివేసింది. అప్పటి నుంచి రోడ్లపై అంబాసిడర్ కార్లు కనిపించడమే మానేశాయి. తమ వద్ద అంబాసిడర్ కారు ఉన్న వాళ్లు కూడా వాటిని అమ్మేసి కొత్త మోడల్ కార్లు కొనడంతో ఇక అంబాసిడర్ కారు కంటికి కాన రాకుండా పోయింది.
అంబాసిడర్ కారును మిస్ అవుతున్న వారికి హిందుస్థాన్ మోటార్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే సరికొత్త అవతారం లో.. హైటెక్ ఫీచర్స్‌తో.. అదిరిపోయే మోడల్‌లో అంబాసిడర్ 2.0 మరో రెండేళ్లలో మార్కెట్‌లోకి రానుందని ప్రకటించింది.
ఫ్రాన్స్‌కు చెందిన ప్యూజట్ అనే కార్ల తయారీ సంస్థతో కలిసి.. అంబాసిడర్ కొత్త వెర్షన్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలిపింది. చెన్నైలోని హిందుస్థాన్ మోటార్స్ ప్లాంట్‌లో కొత్త కార్లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్-3 ఆధారంగా ఈ కొత్త వెర్షన్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపింది.
2014లో అంబాసిడర్ కార్ల తయారీ నిలిపివేసిన హిందుస్థాన్ మోటార్స్ 2017లో తన కంపెనీలోని వాటాలను ఫ్యూజట్ సంస్థ కు అమ్మేసింది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసి అందరి ఫేవరెట్ అంబాసిడర్‌ను నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా సరికొత్తగా తయారుచేసేందుకు రెడీ అయ్యారు. మరో రెండేళ్లలో మార్కెట్‌లోకి రానున్న అంబాసిడర్ 2.0.. మళ్లీ తన హవా కొనసాగిస్తుందా..? ఇండియన్ రోడ్లపై మరోసారి తానే కింగ్ అని నిరూపించుకుంటుందా..?