Begin typing your search above and press return to search.
జగన్ అండతో ‘అంబటి’ యాక్షన్ ప్లాన్?
By: Tupaki Desk | 4 Sep 2020 10:50 AM GMTగుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజకీయంలో అనుకోని మలుపు ఎదురైంది. ఏకంగా సొంత వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పై వైసీపీ కింది స్థాయి నేతలే హైకోర్టుకు ఎక్కడం వైసీపీని ఇరుకునపెట్టింది.
కానీ అనూహ్యంగా అంబటి రాంబాబుకు అభయం దొరికింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన ప్రత్యర్థుల పనిపడుతున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే రాంబాబు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారని వైసీపీ నాయకులే హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో రాంబాబుకు రిస్క్ తప్పదు అని అనుకున్నారంతా..
సీఎం జగన్ ఈ విషయంలో కలుగజేసుకొని రిపోర్ట్ తెప్పించుకున్నారట.. అక్రమ మైనింగ్ లో అంబటి పాత్ర లేదని.. ఆరోపణలు నిజం కాదని సీఎం తెలుసుకున్నారని సమాచారం. దీంతో అంబటికి సీఎం జగన్ మద్దతుగా నిలిచారని టాక్. సొంత వైసీపీ నేతలే ఇలా హైకోర్టుకెక్కడం పై సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో అంబటితో వారిపై పరువు నష్టం దావా వేయడానికి రెడీ అవుతున్నారట..