Begin typing your search above and press return to search.

మీడియాకు దూరంగా అంబ‌టి.. అస‌లేం జ‌రిగిందంటే...!

By:  Tupaki Desk   |   24 Jun 2021 12:30 PM GMT
మీడియాకు దూరంగా అంబ‌టి.. అస‌లేం జ‌రిగిందంటే...!
X
అంబ‌టి రాంబాబు. ఈయ‌న‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆయ‌న వ్యాఖ్య‌లు.. సుదీర్ఘ వివ‌ర‌ణ‌లు.. వైసీపీకి ఆయ‌న ఇచ్చే ప్రియార్టీ.. అదేస‌మ‌యంలో టీడీపీ నేత‌ల‌పై చేసే తీవ్ర విమ‌ర్శ‌లు.. వంటివి ఆయ‌న‌ను హాట్ లీడ‌ర్‌గా నిల‌బెట్టాయి. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నుంచి అప్ప‌టి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌పై పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న అంబ‌టి.. ఆది నుంచి కూడా మాట‌ల తూటాలు పేల్చ‌డంతో పేరు తెచ్చుకున్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో నూ ఆయ‌న గ‌ట్టి వాయిసే వినిపించారు. దీంతో పార్టీ ఆయ‌న‌ను మీడియాతో మాట్లాడేందుకు అనుమ‌తించింది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌ర‌చుగా మీడియా ముందుకు రావ‌డం.. వాయిస్ వినిపించ‌డం అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల కాలంలో అంబ‌టి ప్రెస్ మీట్లు త‌గ్గిపోయాయి. ఆయ‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా.. కేవ‌లం తాడేప‌ల్లిలోని పార్టీ ఆఫీస్‌కు వ‌చ్చి వెళ్తున్నారే త‌ప్ప‌.. మీడియా కంట మాత్రం క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం ఏంటి? గ‌తంలో ఏ మీడియా ప్ర‌తినిధి క‌నిపించినా.. కారు ఆగి మ‌రీ.. బైట్ తీసుకుంటావా ? ( మాట్లాడ‌మంటావా?) అని అడిగి మ‌రీ.. ఆయ‌నే మాట్లాడిన అంబ‌టి కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నారు. మ‌రి దీనికి ఏమైంది? అంబ‌టి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అనే ప్ర‌శ్న‌లు మీడియా వ‌ర్గాల్లోనూ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పోనీ.. మాట్లాడేందుకు విష‌యం లేదు.. అని చెప్ప‌డానికి కూడా లేదు. ఎందుకంటే.. నిత్యం టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ స‌ర్కారు టార్గెట్ చేస్తున్నారు. బాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ కూడా ఏదో ఒక కార్య‌క్ర‌మంతో జ‌గ‌న్‌పై విరుచుకుపడుతు న్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను త‌ప్పుప‌డుతున్నారు. సో.. వీట‌న్నింటిపైనా అంబ‌టి మ‌ట్లాడొచ్చు. కానీ, ఆయ‌న మౌనం గా ఉంటున్నారు. దీనికి కార‌ణం ఏంటంటే.. ఇటీవ‌ల అంబ‌టి.. ఓ వెబ్ ఛానెల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. దీనిలో ఆయ‌న సీఎం జ‌గ‌న్ విష‌యంలో ఆచి తూచి మాట్లాడ‌కుండా.. నోరు జారారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. నెటిజ‌న్ల నుంచి భారీ విమ‌ర్శ‌లు వ‌చ్చారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న మీడియా కు దూరంగా ఉంటున్నారు.

ఇంత‌కీ అంబ‌టి ఏమ‌న్నారంటే.. ``ప్ర‌భుత్వంపై అక్క‌సుతోనే లేనిపోని అభాండాలు వేస్తున్నారు. అందునా.. చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో కూర్చుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆయ‌న ఎందుకు ఏపీకి రావ‌డంలేదు. ఇంటి గ‌డ‌ప ఎందుకు దాట‌డం లేదు.`` అన్నారు. దీంతో విలేక‌రి.. మ‌రి సీఎం జ‌గ‌న్ కూడా తాడేప‌ల్లి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు క‌దా? అని ప్ర‌శ్నించ‌గా.. అంబ‌టి ఫైర‌య్యారు. క‌రోనా ఉంది కాబ‌ట్టే సీఎం జ‌గ‌న్ రావ‌డం లేద‌ని నోరు జారారు. మ‌రి ఇదే క‌రోనా ఉంది క‌నుక చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ఉంటున్నార‌న్న ప్రశ్న‌ను ఆయ‌న స‌మ‌ర్ధించిన‌ట్టు అయిపోయింది. అంటే ఒక‌ర‌కంగా.. అంబ‌టి ఇంట‌ర్వ్యూ బెడిసి కొఒట్టింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న మీడియాకు మొహం చూపించ‌డం మానేశార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.