Begin typing your search above and press return to search.
ఆ జంప్ జిలానీలు ఎర్రచందనం దొంగల కంటే డేంజర్
By: Tupaki Desk | 6 July 2017 4:30 PM GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన ఏపీ మంత్రులపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం దుండగులు పట్టుబడిన వ్యవహారంపై మంత్రులు ఆదినారాయణరెడ్డి - అమరనాథ్ రెడ్డి స్పందించడం చిత్రంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు దొరికితే ఆ సంస్థ వ్యవస్థాపకుడైన సీఎం చంద్రబాబు - హెరిటేజ్ యాజమాన్యం స్పందించాల్సి ఉంటుందని, కానీ వారు కాకుండా అమర్నాథ్ రెడ్డి - ఆదినారాయణరెడ్డిలు మాట్లాడడమేంటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీకి అమ్ముడుపోయి మంత్రులుగా చెలామణి అవుతున్న వీరిద్దరూ హెరిటేజ్ దొంగలకన్నా ప్రమాదకరమని అంబటి నిప్పులు చెరిగారు. ఏకంగా రాజకీయాలనే అమ్ముకున్న దొంగలు అమర్నాథ్ - ఆదినారాయణరెడ్డిలను దుయ్యబట్టారు. అలాంటి వారు వైఎస్ జగన్ ను విమర్శించడం నీచమన్నారు.
హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం దుంగలను పట్టుకున్నది పత్రిపక్ష వైఎస్సార్సీపీ వారో, సామాన్య ప్రజలో కాదని సాక్షాత్తు .టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారన్న విషయం గమనించాలని అంబటి రాంబాబు అన్నారు. హెరిటేజ్ వ్యాన్ తమదికాదని చెప్పుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం మీది, పాలకులు మీరు అయినా హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు ఇంకా అమ్ముకుంటున్నారంటే మూడేళ్లలో ఎర్రచందనం ఏమేరకు అమ్ముకోకుండా ఉండే కార్యక్రమాలు చేశారని ప్రశ్నించారు. గతంలో బాబు పొలంలోనూ ఎర్రచందనం దుంగలు దొరికితే ఎలా వచ్చాయో తనకు తెలియదని తప్పించుకున్నారన్నారు. దొంగ వ్యాపారం అంతా చంద్రబాబు చుట్టూ ఉంది కాబట్టే ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలోఉన్నారని అంబటి దుయ్యబట్టారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు వైఎస్సార్సీపీ నాయకుల్ని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆయనకు నమస్కారం చేస్తే అదేదో తప్పన్నట్టు తెలుగుదేశం, కాంగ్రెస్ లు విమర్శలు చేయడం అన్యాయమని అంబటి రాంబాబు అన్నారు. వయసులో పెద్దవారిని గౌరవించడం భారతదేశ సంప్రదాయమని చెప్పారు. గౌరవప్రదమైన పదవికి పోటీ చేస్తున్న వ్యక్తికి పాదాభివందనం చేస్తే... వైఎస్ జగన్ కాళ్లు పట్టుకున్నాడంటూ జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అందితే జుట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే నీచమైన బుద్ధి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీదని ఎద్దేవా చేశారు. గౌరవంగా పాదాభివనందనం చేస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రబుద్ధులు గమనించాలని, విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచే అవకాశం లేకున్నా రాజకీయం చేసి మీరు పోటే పెడుతున్న దాన్నితాము ఖండిస్తున్నామన్నారు. దీనిపై పునరాలోచించుకోవాలన్నారు. బీజేపీతో తాము కలిసిపోయినట్టు కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాట్లాడడం అవివేకమన్నారు. అభ్యర్థిని బలపర్చేంతవరకే తమ పని అన్నారు. కలిసి పోటీ చేసి మంత్రివర్గంలో ఉన్నది చంద్రబాబు అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.