Begin typing your search above and press return to search.
వామ్మో ఈ మాటలేంది అంబటి..?
By: Tupaki Desk | 12 Jun 2016 11:27 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు మళ్లీ గళం విప్పారు. తుని విధ్వంసంలో అరెస్ట్ చేసిన నిందితుల్నివెంటనే విడుదల చేయాలంటూ గడిచిన నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇష్యూతో పాటు.. ముద్రగడ దీక్ష సందర్భంగా సాక్షి చేసిన ప్రసారాల మీద ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వాటిని నిలిపివేసిన అంశం మీద అంబటి గుస్సా అయ్యారు. బాబు సర్కారుపై తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన ఆయన మాటల్ని ఆయన మాటల్లోనే చెప్పేస్తే.. ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. మరిక.. ఆయన మాటల్ని చదివేయండి..
= ముద్రగడను పరామర్శించేందుకు వెళితే పోలీసులు అరెస్ట్ చేసి కోరుకొండ స్టేషన్ కు తరలించారు. రాజమండ్రిలో వందలాది మంది పోలీసులు ఉన్నారు. పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ చూస్తుంటే.. రాజమండ్రిలో ఉన్నామా? పాకిస్థాన్ లో ఉన్నామా? అన్నట్లుగా ఉంది.
= ముద్రగడ విషయంలో ఉగ్రవాది కసబ్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుది దౌర్జన్య పాలన చేస్తున్నారు. ముద్రగడ దీక్షకు అనుకూలంగా చేస్తున్న బంద్ ను భగ్నం చేయటానికి సాధారణ పోలీస్ నుంచి ఐపీఎస్ అధికారి వరకూ అందరూ ప్రయత్నించారు.
= సాక్షి ఛానల్ ప్రసారాల్ని నిలిపేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదు. తొలుత 21 రోజుల పాటు నోటీసులు ఇచ్చినతర్వాతే చర్యలు తీసుకోవాలి. ఏ ముఖ్యమంత్రి చెప్పాడనో.. లోకేశ్ చెప్పాడనో.. హోంమంత్రి చెప్పాడనో ప్రసారాలు నిలిపివేయకూడదు.
= ప్రభుత్వాలు చెప్పినట్లుగా చానెళ్లు ప్రచారం చేయటం సాధ్యం కాదు. నాయకులు మారినప్పుడల్లా ఛానెల్ ప్రసారాలు చేసే తీరు మార్చుకోవాలా? పాలకులకు అనుకూలంగా చానెల్ ప్రసారాలు ఉండాలా? నాలుగు రోజులుగా సాక్షి ఛానెల్ ఎందుకు నిలిపివేశారు?