Begin typing your search above and press return to search.

ఆ ఉద్రిక్తతకు కారణం కోడెలేనట

By:  Tupaki Desk   |   14 April 2019 7:39 AM GMT
ఆ ఉద్రిక్తతకు కారణం కోడెలేనట
X
ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. స్పీకర్ కోడెలపై దాడి ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తవుతున్నయి. ఈ మొత్తం గొడవకు కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. ఈ పరిస్థితికి కారణం కోడెలే అంటూ జగన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఫ్యాక్షన్ కల్చర్ పెరగటానికి కారణం కోడెలగా మండిపడుతున్నారు జగన్ పార్టీ నేతలు.

తమ పార్టీ నేతలపై కోడెల అక్రమంగా కేసులు పెట్టినట్లుగా జగన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న వారిపై గతంలో ఎలాంటి కేసులు లేవన్న విషయాన్ని వారు చెబుతుననారు. కోడెల పైకి ఇనిమెట్లలో ప్రజలను ఉసిగొల్పి.. మళ్లీ తమ మీదనే కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. తమ మీద కేసులు పెట్టే ముందు.. తమ గురించి ఫిర్యాదు చేసిన కోడెల కేసుల హిస్టరీ చూస్తే ఆయనకున్న కేసులు బయటకు వస్తాయన్నారు.

అదికారులను.. ఓటర్లను బెదిరించటం లాంటి వాటికి సంబంధించి ఆయనపై కేసులు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. తాజా ఎన్నికల్లో తాము కుట్ర చేసినట్లుగా కోడెల వర్గం ఆరోపిస్తుందని.. తామువిచారణకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భయపెడితే పారిపోవటం తనకు కుదరని పనిగా జగన్ పార్టీకి చెందన అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాము ఎలాంటి విచారణకైనా రెఢీ అని చెప్పిన ఆయన.. పోలింగ్ జరుగుతున్న వేళ తాను ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామానికి వెళ్లానని.. తనను బూత్ లోకి కూడా రానివ్వలేదని అంబటి వాపోయారు. బూత్ ను అక్రమించినోళ్లను వదిలేసిట్లుగ చెప్పున్న ఆయన మాటలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి.