Begin typing your search above and press return to search.
అంబటి మాట...ఆ నలుగురికే రాజధాని
By: Tupaki Desk | 26 Aug 2015 9:52 AM GMTవైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్వరం చాలా రోజులకు వినిపించింది. ఇటీవల మీడియాలో పెద్దగా కనపడని ఆయన బుధవారం చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. పార్టీ అధినేత జగన్ దూరం పెట్టడం వల్లనో... నిన్న గాక మొన్న వచ్చిన బొత్స తరువాత ప్లేస్ లో పార్టీలో కొనసాగడం ఇష్టం లేకనో.. మనోడు గుంటూరు మిర్చి యార్డుల్లో కాలం గడిపేస్తున్నాడు .
ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ సింగపూర్ వంటి రాజధాని నిర్మించబోతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని....తన వారైన నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, సీఎం.రమేశ్, సుజనా చౌదరికి ప్రయోజనం చేకూర్చే విధంగా రాజధాని నిర్మించేందుకు బాబు సిద్ధమవుతున్నారని రాంబాబు విమర్శించారు. వీరి ప్రయోజనాల కోసం రైతులను బలి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రైతుల వెనక ఎవరో ఉండి ఇలా మాట్లాడిస్తున్నారని టీడీపీ నేతలు చెప్పడం విచిత్రంగా ఉందని..రైతులు తమ కడుపుమండి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కాని ..వారి వెనక ఎవ్వరూ లేరన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని అంబటి సూచించారు. ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లిన చంద్రబాబు చివరికి సాధించిందేమీ లేదు.ఓటుకు నోటు కేసు మాఫీ చేసుకునేందుకే ఆయన ఢిల్లీ వెళ్లివచ్చినట్లుందని మండిపడ్డారు.