Begin typing your search above and press return to search.

ఏమాటకామాటే అంబటి మాటలో అర్థముంది

By:  Tupaki Desk   |   8 April 2016 9:44 AM GMT
ఏమాటకామాటే అంబటి మాటలో అర్థముంది
X
రాజకీయాలు అన్నాక విమర్శలు.. ప్రతివిమర్శలు మామూలే. ఎంత కొట్టిపారేసినా.. కొన్నిసార్లు రాజకీయ నేతలు మాట్లాడే మాటల్లో కొంత విలువైన సమాచారం ఉంటుంది. అర్థవంతమైన వాదన ఉంటుంది. అలాంటి వాదననే వినిపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఆవేశంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం.. ఎలాంటి వ్యాఖ్య అయితే అలాంటి వ్యాఖ్యలు చేయటం అంబటికి అలవాటన్న అపొహ స్థానే ఆయన కాస్త అర్థవంతంగా మాట్లాడరన్న భావన తాజా వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుంది.

కేంద్ర కార్యదర్శి కోఠారిపై వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేయటం.. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఏపీకి అందాల్సిన సాయాన్ని అందించేలా చూడాలంటూ చురకలు వేయటం తెలిసిందే. ప్రధాని మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే చంద్రబాబు.. అందుకు భిన్నంగా కేంద్ర కార్యదర్శి మీద మండిపడటం ఆశ్చర్యాన్ని.. ఆసక్తిని రేకెత్తించింది. సరిగ్గా ఇదే పాయింట్ ను టచ్ చేసిన అంబటి రాంబాబు.. వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర కార్యదర్శిపై ఎగిరితే ఏమీ రాదని.. విభజన అంశాలపైనా.. ప్రత్యేక హోదా మీదా కేంద్రాన్ని గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతున్నారంటూ మండిపడ్డారు.

ప్రధాని మోడీతో రాష్ట్ర సమస్యల గురించి నేరుగా మాట్లాడాల్సింది పోయి.. కోఠారితో రాయబారం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అంబటి చెప్పినట్లుగా.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలపై ఏపీ సర్కారు బలంగా గళం వినిపించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. కానీ.. అందుకు సిద్ధంగా లేని చంద్రబాబు.. తనలోని అసహనాన్ని ఇలా కేంద్ర అధికారుల మీద ప్రదర్శించటం మంచిది కాదు. అసలు తలకాయిలు నిర్ణయం తీసుకోనప్పుడు.. ఉద్యోగులు మాత్రం ఏం చేయగలరు? అడగాల్సిన వారిని అడగాలే కానీ.. ఇలా అందరిని అనేస్తే ఏం బాగుంటుంది..?