Begin typing your search above and press return to search.
ఎవరేంచేసినా వైసీపీ చేయిస్తున్నట్లేనా?
By: Tupaki Desk | 19 April 2018 2:46 PM GMTరాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. ఏ వివాదం నెలకొన్నా ఆ వివాదాలను వైసీపీ వైపు మళ్లించే ప్రయత్నం ఒకటి చాలాకాలంగా జరుగుతోంది. తమకేం సంబంధం లేదని వైసీపీ... వైసీపీకి తమకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత వ్యక్తులు ఎన్నిసార్లు చెప్పినా ఈ ఆరోపణలు ఆగడం లేదు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తునిలో రైలు దహనమైంది. ఆ ఘటన వెనుక వైసీపీ కార్యకర్తలున్నారంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. కాదని తేలడంతో.. నిత్యం ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్న ముద్రగడ వెనుక జగన్ ఉన్నారంటూ మరోసారి ఆరోపణలు మొదలు పెట్టారు. నాకు, జగన్ కు సంబంధం లేదని ముద్రగడ స్వయంగా చెప్పినా టీడీపీ తీరు మారలేదు.
ఆ తరువాత పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ వరుసగా అటాక్స్ చేసినప్పుడు ఆయన వెనుక కూడా వైసీపీ ఉందంటూ ఆరోపణలు చేశారు.
తాజాగా శ్రీరెడ్డి వ్యవహారంలోనూ వైసీపీ అండదండలున్నాయన్న ఆరోపణలు తొలుత వచ్చాయి. రోజుకో మాట చెప్పే శ్రీరెడ్డి ఇప్పుడు తనను వైసీపీ వాడుకోవాలని చూసిందంటూ ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా దానికి వైసీపీయే కారణమంటూ టీడీపీ ఆరోపణలు చేయడం అలవాటుగా మారిపోయింది. దీంతో తాజాగా శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ఖండించారు. శ్రీరెడ్డి వెనుకో..మరో రెడ్డి వెనుకో ఉండాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, ఏదైనా మాట్లాడదలచుకుంటే సూటిగా, ఘాటుగా మేమే మాట్లాడతాము తప్ప, ఎవరి వెనుక ఉండాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఎవరు ఏం చేసినా దాని వెనుక వైసీపీ ఉందంటూ కొందరు కుట్ర చేస్తున్నారని అంబటి విమర్శించారు.