Begin typing your search above and press return to search.

అంబటి రాంబాబు పాత ఫొటో లీక్ అయ్యింది!

By:  Tupaki Desk   |   12 April 2022 6:41 AM GMT
అంబటి రాంబాబు పాత ఫొటో లీక్ అయ్యింది!
X
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. నిన్న 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో కొందరు పాత వారు కాగా.. మిగతా అందరూ కొత్త వారే.. కొత్తగా మంత్రులైన వారి గురించి విషయాలు వైరల్ అవుతున్నాయి. వారి ప్రస్థానం.. ఎదిగిన తీరు గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

జగన్ కు నమ్మినబంటుగా.. వైసీపీ తరుఫున వాయిస్ బలంగా వినిపించే నేతగా అంబటి రాంబాంబుకు పేరుంది. కొత్త కేబినెట్ లో రాంబాబుకు అత్యంత కీలకమైన 'భారీ నీటిపారుదల శాఖ' దక్కింది. తన మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆయనలో మరో యాంగిల్ కూడా ఉంది. గతంలో సినీ ఇండస్ట్రీతో రాంబాబుకు అవినాభావ సంబంధం ఉందనే విషయం తాజాగా లీక్ అయ్యింది.

ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన అంబటి రాంబాబు గతంలో సినిమాల్లో, నాటకాల్లో నటించినట్టు తేలింది. ఈ మేరకు ఆయన ఓ సినిమాలో నటించినట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబటి రాంబాబు యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ సినిమాలో నటించినట్లు ఫొటోల్లో స్పష్టమవుతోంది.

రాంబాబు నటించింది ఏ సినిమాలో అయితే తెలియదు కానీ.. బీచ్ లో గుడిసెలో ఉండే ఒక పేద వ్యక్తి పాత్రలో ఒదిగిపోయినట్టు తెలుస్తోంది. అంబటి పక్కన హీరోయిన్ ఉండడంతో ఇది మెయిన్ రోల్ పాత్ర అని తెలుస్తోంది. సినిమా ఏంటి? డైరెక్టర్ ఎవరన్నది మాత్రం తెలియదు. రాంబాబు ఏ సినిమాలో నటించాడన్నది తెలియాల్సి ఉంది.

ఈ ఫొటోలు చూస్తే మాత్రం దాదాపు 30 ఏళ్ల క్రితం వాటివిగా అనిపిస్తోంది. అందులో యంగ్ రాంబాబు అచ్చం సినిమా హీరోను తలపించేలా అందంగా ఉన్నారు. దీంతో రాంబాబు హీరో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా మంత్రి కావడంతో రాంబాబుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ ఫొటోలు బయటకు వస్తున్నాయి. మరి ఆయన నటించిన సినిమా ఏదో మంత్రి అంబటియే వెల్లడించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.