Begin typing your search above and press return to search.
మంత్రి అంబటి రాంబాబుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమిదేనా?
By: Tupaki Desk | 24 May 2022 3:59 AM GMTఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై మీడియాతో మాట్లాడారు.. అంబటి. ఎప్పటిలానే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై విరుచుకుపడ్డారు. అయితే పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ ను కూడా అంబటి లక్ష్యంగా చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా.. బోనియర్ ఎన్టీఆర్ వచ్చినా వైఎస్సార్సీపీని ఎవరూ ఏమీ చేయలేరని అంబటి వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు జూనియర్ అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది.
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై రెచ్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. గతంలో అంబటి రాంబాబు ఒక మహిళతో అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడుతూ.. నాతో గంట ఉంటావా.. అర గంట ఉంటావా అంటూ మాట్లాడిన ఆడియో క్లిప్ ను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాముల్లో పెట్టి ఇది నీ బ్రతుకు రాంబాబు అంటూ ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
అంబటి రాంబాబు పాపులర్ కావడానికి, రాజకీయంగా మైలేజ్ సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. అంబటి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. మాటలు మర్యాదగా రానివ్వాలని హెచ్చరిస్తున్నారు. నీ ప్రాసల కోసం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ను వాడుకుంటే పుట్టగతులు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అంబటి అన్నమాటలకు తిరిగి అంతే రిటర్ను గిఫ్టుగా ఇస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ కు వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్సు ట్రెండ్ చేస్తున్నారు. #JaganShouldApologizeJrNTR అనే హాష్ ట్యాగుతో రచ్చ రచ్చ చేస్తున్నారు.
కాగా ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలోనూ తారక్ అభిమానులకు, వైఎస్సార్సీపీ నేతలకు వివాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జన్మదినంగా సందర్భంగా తెనాలిలో బ్యానర్లు కడుతున్న అతడి అభిమానులపై తెనాలి మున్సిపాలిటీ వైఎస్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వీధిలో తారక్ బ్యానర్లు కట్టడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. దీనిపై తారక్ అభిమానులు అంతే ధీటుగా స్పందించడం తెలిసిందే.
కాగా, అనంత బాబు వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని నిప్పులు చెరిగారు. అలాగే టీడీపీకి పట్టిన శని లోకేష్ అని.. గతంలో లోకేష్ ఏ యూనివర్సిటీలో చదివాడో తెలియదు కానీ.. స్విమ్మింగ్ పూల్ లో బీరు తాగుతూ.. అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేశాడని ఎద్దేవా చేశారు. లోకేష్ కు పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదన్నారు. తనను మాత్రం టీడీపీ నేతలు.. గంటా, అరగంటా అంటూ అవమానిస్తుంటారని.. లోకేష్ గురించి తానేమైనా అంటే.. చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ కుటుంబం మీడియా ముందుకొచ్చి ఏడుస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.