Begin typing your search above and press return to search.
హమ్మయ్య...పవన్ ఒప్పుకున్నారు....తథాస్తూ..!
By: Tupaki Desk | 5 Dec 2022 12:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కారణంగా అన్నారో కానీ తానూ రాజకీయంగా ఫెయిల్ అయ్యాను అని చెప్పారు. ఆయన అలా అన్నారో లేదో వైసీపీ మంత్రులు పెద్ద నోళ్ళు వేసుకుని పడిపోతున్నారు. మేము ముందే చెప్పాం, పవన్ ఫెయిల్ అని. ఈ రోజు ఆయన ఒప్పుకున్నారు, మహా సంతోషం అని మంత్రులు వరసబెట్టి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
అంబటి రాంబాబు అయితే పవన్ రాజకీయంగా జీరో, సినిమాలోనే హీరో అంటూ కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఒక విధానం అంటూ లేదని, తాను చేగువీరా అభిమానిని అని చెప్పుకునే ఆయన బీజేపేతో చేతులు కలిపారని విమర్శించరు. పవన్ పోకడలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఆయన రాజకీయంగా ఎప్పటికీ సక్సెస్ కాలేరని అంబటి జోస్యం చెప్పారు.
మరో మంత్రి నారాయణస్వామి అయితే పవన్ హీరో మాత్రమే చంద్రబాబు మొత్తం సినిమా ఏంటో చూపిస్తారు ఆయన చూపించే సినిమాతో పవన్ షాక్ తింటారు అంటూ కామెంట్స్ చేసారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వారు బాబు అని పవన్ విషయంలో కూడా ఆయన అదే చేస్తారని, పవన్ కి ఆ విషయం తరువాత అర్ధం అవుతుందని అన్నారు.
చంద్రబాబుని ప్రజా కోర్టు నుంచి కూడా బహిష్కరించాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఏమి చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. ఎవరెన్ని కూటములు కట్టినా ఎంతగా కలసి ముందుకు వచ్చినా కూడా వైసీపీ మరోసారి ఏపీలో గెలవడం ఖాయమని ఆయన స్పష్టం చేసారు.
ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు వైసీపీకి బ్రహ్మరధం పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. మరో వైపు పోలవరం 2018 నాటికే పూర్తి చేస్తాను అని చెప్పిన చంద్రబాబు దాన్ని పూర్తి చేయకపోగా ఇపుడు జనాల ముందుకు వచ్చి దీర్ఘాలు తీస్తున్నారు అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బాబు నిర్వాకం వల్లనే పోలవరం ప్రాజెక్ట్ కి ఈ గతి పట్టింది అని ఆయన విమర్శించారు. బాబు తొందరపాటు నిర్ణయాల వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది అని అంబటి ఆరోపించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.