Begin typing your search above and press return to search.

నాగబాబుకు ‘అంబటి’ పోటు

By:  Tupaki Desk   |   19 Jan 2020 6:57 AM GMT
నాగబాబుకు ‘అంబటి’ పోటు
X
అంబటి రాంబాబు.. సామాజిక సమీకరణాల్లో మంత్రి పదవి మిస్ అయ్యింది కానీ.. వైసీపీలో కీలక నేత. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. మాటల తూటాలు పేల్చడంలో నేర్పరి. అసెంబ్లీలోనే చంద్రబాబును చెడుగుడు ఆడేసుకున్న గడుసరి.. తాజాగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన మెగా బ్రదర్ నాగబాబును ఉతికి ఆరేశాడు. నాగబాబుకు కౌంటర్ ఇచ్చిన అంబటి ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తాజాగా ఓ ట్వీట్ లో వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. ‘జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లే’ అంటూ నాగబాబు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.

దీనికి వైసీపీ నేత అంబటి రాంబాబు తగులుకున్నారు. ‘తాను తోకలేని పిట్ట సినిమాలో నటించానని మరిచానని.. నటనలో ఓడిపోయి వైదొలిగానని.. రాజకీయాల్లో ఓడినా నాగబాబు ఇంకా వైదలగడం లేదేమీ’ అంటూ నాగబాబుకు దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఇక ఆయన అన్నయ్యను అంబటి వదల్లేదు. పూటకో పార్టీతో పవన్ కళ్యాణ్ దోస్తీ చేస్తాడంటూ ఆయన కలిసిన నేతలందరి ఫొటోలను షేర్ చేసి ఎండగట్టారు.