Begin typing your search above and press return to search.

2+2 = ఎంత అంటే.. ఒక్కొక్క‌ ప‌త్రిక‌కు ఒక్కో ఆన్స‌ర్ ఉంటుందా మంత్రి వ‌ర్యా!

By:  Tupaki Desk   |   25 April 2022 4:30 PM GMT
2+2 = ఎంత అంటే.. ఒక్కొక్క‌ ప‌త్రిక‌కు ఒక్కో ఆన్స‌ర్ ఉంటుందా మంత్రి వ‌ర్యా!
X
2+2 ఎంత అంటే.. ఏం స‌మాధానం చెబుతారు? మ‌న ద‌గ్గ‌ర ఒక‌లా. ప‌క్క‌రాష్ట్రంలో ఒక‌లా.. దేశంలో మ‌రోలా.. ప్ర‌పంచంలో ఇంకోలా అయితే.. చెప్ప‌రు క‌దా! 2+2 =4 అనేక‌దా.. స‌మాధానం. ప్రాంతాలు మారినా.. పార్టీలు మారినా.. నాయ‌కులు మారినా.. 2+2 స‌మాధానం ఒక్క‌టే. అయితే.. ఏపీలో తాజాగా మంత్రి అయిన‌.. అంబటి రాంబాబు మాత్రం ఒక్కొక్క‌రికి ఒక్కొక్క స‌మాధానం ఉంటుంద‌ని అంటున్నారు. ఆశ్చ‌ర్యంగా అనిపించి నా.. ఇది నిజం! ఇటీవ‌ల ఆయ‌న మీడియా స‌మావేశం పెట్టారు. పోల‌వ‌రంపై మాట్లాడుతూ.. ఓ విలేక‌రి వేసిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఇలానే ఆన్స‌ర్ చేశారు.

ప‌త్రిక‌లందు అన్ని ప‌త్రిక‌లుఒక‌టికాదు. అందుకే.. వైసీపీ వ్య‌తిరేక మీడియాకు ఒక స‌మాధానం.. వైసీపీ సానుకూల మీడియాకు మ‌రో స‌మాధానం ఉంటుంది! అన్ని స‌మాధానాలు ఒకే విదంగా మాత్రం ఉండ‌వు .. అని చెప్పుకొచ్చారు. దీంతో అక్క‌డున్న విలేకరులు ఖంగుతిన్నారు. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న అంబ‌టి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ అధికార ప్ర‌తినిధిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆయ‌న విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఏవేవో.. మాట్లాడేవారు. ఇక‌, ఎమ్మెల్యేగా కూడా ఆయ‌న అనేక విష‌యాలు చ‌ర్చించారు.

కానీ, ఇప్పుడు ఆయ‌న మంత్రి అయ్యారు. మంత్రిగా ఆయ‌న చేసే వాఖ్య‌ల‌కు చాలా వాల్యూ ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు.. ఏం మాట్లాడినా.. ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఇటీవ‌ల జ‌గ న్ కేబినెట్ 2.0లో చేరిన అంబ‌టి.. జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. సో.. ఆయ‌న‌పై రాష్ట్రంలోని ప‌లు ప్రాజెక్టులు.. ఇత‌ర‌త్రా... వ్య‌వ‌హారాల‌పై ప‌ట్టు ఉంటుంది. చేతిలో ఉన్న‌తాధికారులు ఉంటారు. సో.. వారంద‌రి సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో.. మంత్రిగా ఆయ‌న కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించాలి. ఆయ‌న ఏం మాట్లాడినా.. రికార్డు కూడా అవుతుంది.

అంతేకాదు.. మంత్రిగా ఆయ‌న ఎవ‌రితో మాట్లాడినా.. ఎక్క‌డ మాట్లాడినా.. రాగ‌ద్వేషాలు.. ప‌క్ష‌పాతం లేకుండా ప‌నిచేస్తాన‌ని.. ప్ర‌మాణ స్వీకారం చేసినందున అంద‌రి విష‌యంలోనూ.. మంత్రిగా ఆయ‌న ఒకే విధంగా వ్య‌వ‌హ‌రించాలి. అయితే.. మంత్రి అంబ‌టి మాత్రం ఆయా విష‌యాల‌ను మ‌రిచిపోయిన‌ట్టు ఉన్నారని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. పోల‌వ‌రం విష‌యంపై మీడియా వేసిన ప్ర‌శ్న‌ల‌కు.. ఒక్కొక్క పేప‌ర్‌కు.. ఒక్కొక్క మీడియాకు ఒక్కొక్క విధంగా స‌మాధానం ఉంటుంద‌ని.. అంబ‌టి వ్యాఖ్యానించ‌డ‌మే!

టీడీపీ అనుకూల మీడియ‌కు ఒక స‌మాధానం ఉంటుంద‌ని.. వైసీపీ అనుకూల మీడియాకు మ‌రో స‌మ‌ధానం ఉంటుంద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఎందుకంటే.. ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో చెప్పిన మేర‌కు ఆయ‌న అంద‌రినీ స‌మానంగా చూడాలి. మంత్రిగా ఒక హుందా ఉండాలి. అయితే.. ఇప్పుడు అంబ‌టి వ్య‌వ‌హారంపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ పెరిగిపోయాయి. "మంత్రిగా హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన మీరు ఇలా ఏది ప‌డితే అది మాట్లాడితే ఎలా మంత్రి స‌ర్‌!!" అని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

అతి పెద్ద‌, ఇంపార్టెంట్ శాఖ అయిన‌.. ఇరిగేష‌న్ బాధ్య‌త‌లు తాజాగా చేప‌ట్టినందున‌.. అంబ‌టికి .. ఈ శాఖ పై ఇంకా ప‌ట్టు రాక‌పోయి ఉండొచ్చు. స‌బ్జెక్టు కూడా ఇబ్బందిగా ఉండి ఉండొచ్చు. కానీ, ఇలా ఒక్కొక్క‌రికీ ఒక్కో ఆన్స‌ర్ ఉంటుంద‌ని వ్యాఖ్యానించ‌డం ఏంట‌నేది నెటిజ‌న్ల కామెంట్స్‌. తాజాగా జ‌రిగిన వివాదంలో ప్ర‌తిపేప‌ర్ ఒక టే హెడ్‌లైన్ పెట్టారుక‌దా? పార్టీకి సానుభూతిగా ఉన్న పేప‌ర్లు.. వాళ్ల‌కు అనుకూలంగా పెట్టుకుంటారు. అయితే.. అంబి మాత్రం పేప‌ర్‌ను బ‌ట్టి స‌మాధానం ఉంటుంది.. అంటే.. రాజ్యాంగంలో అలా ఉండ‌దు క‌దా.. మంత్రి స‌ర్‌!! అని నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. ఆయ‌న త‌న విధానం మార్చుకుంటా రో లేదో చూడాలి.