Begin typing your search above and press return to search.
త్రీడీ గ్లాస్ ల కోసం ఆర్డర్ ఇచ్చా.. రాయుడి ట్వీట్
By: Tupaki Desk | 17 April 2019 7:36 AM GMTమేలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులో రాయుడు.. రిషిబ్ పంత్ లకు చోటు దక్కటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. దీనిపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. జట్టులో వీరిద్దరికి స్థానం లభించకపోవటం పలువురిని షాకింగ్ కు గురి చేసింది.
జట్టు కూర్పు ఓకే అయినా.. ఇద్దరు ప్రముఖులకు స్థానం లభించకపోవటాన్ని తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. రాయుడు.. పంత్ లకు చోటు దక్కటంపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్. రాయుడు స్థానంలో చోటు దక్కించుకున్న విజయ్ ను ఆయన పొగిడేశారు.
ఫోర్త్ డౌన్ లో దిగే సత్తాతో పాటు.. తన మీడియం పేస్ తో కొన్ని ఓవర్లు వేయగలగటం.. చక్కగా పీల్డింగ్ చేయటం లాంటి గుణాలతో చోటు దక్కించుకున్నట్లు చెప్పారు. విజయ్ తో పోలిస్తే రాయుడు కొన్ని విషయాల్లో వెనుకబడినట్లుగా ఆయన చెప్పకనే చెప్పేశారు. దీంతో.. రాయుడికి అవకాశం మిస్ అయితే.. విజయ్ కు జట్టులో చోటు లభించినట్లుగా చెప్పారు.
ఇదిలా ఉంటే.. తనకు వరల్డ్ కప్ టీమ్ లో స్థానం లభించకపోవటంపై అంబటి రాయుడు స్పందించారు. తాను వరల్డ్ కప్ మ్యాచ్ లు చూసేందుకు త్రీడీ గ్లాస్ ల కోసం ఆర్డర్ పెట్టినట్లుగా ట్వీట్ పోస్ట్ చేశారు. జట్టులో చోటు దక్కే సత్తా ఉన్నా.. తనకు అవకాశం ఇవ్వని తీరును ఆయన తనదైన శైలిలో ట్వీట్ లో పేర్కొన్నట్లుగా చెప్పాలి. అంబటి రాయుడి ట్వీట్ కు పలువురు సానుకూలంగా స్పందించారు. అతడ్ని ఎంకరేజ్ చేస్తూ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. తాజా పరిణామంతో రాయుడి అంతర్జాతీయ క్రికెటర్ గా కెరీర్ ప్రమాదంలో పడిందన్న భయాందోళనలకు గురి అవుతున్నారు.