Begin typing your search above and press return to search.
రాయుడు బ్యాక్.. చేసిన బిగ్ మిస్టేక్స్ ఇవే..
By: Tupaki Desk | 24 Aug 2019 5:19 AM GMTఅంబటిరాయుడు.. తెలుగు తేజం.. దేశానికి వీవీఎస్ లక్ష్మన్ తర్వాత అంతటి గొప్ప క్రికెటర్ అవుతాడని అందరూ ఆశించారు. కానీ తప్పటడుగులు.. ఆవేశంతో కూడిన నిర్ణయాలు తీసుకొని తన క్రికెట్ కెరీర్ ను తనే ముంచుకున్నాడు. తీరిగ్గా ఇప్పుడు కోపం తగ్గించుకొని మళ్లీ బ్యాట్ పడుతానని చెబుతున్నా.. అతడికి మద్దతు దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
తాజాగా క్రికెటర్ అంబటి రాయుడు తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.ప్రస్తుతం టీఎన్సీఏ వన్డే లీగ్ గ్రాండ్ స్లామ్ లో ఆడుతున్న అంబటి మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ఉపసంహరించుకొని భారత్ తరుఫున వన్డే - ఐపీఎల్ లో ఆడాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.
గత ప్రపంచకప్ టీంకు అంబటిరాయుడు ఎంపిక అవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాయుడిని పక్కనపెట్టి ఇతడి స్థానంలో విజయ్ శంకర్ ను ఎంపిక చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే పై ఘాటు ట్వీట్ చేసి కోపంతో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బీసీసీఐ కి కూడా ఈమెయిల్ పంపాడు.
దీంతో రాయుడు క్రికెట్ కెరీర్ కు అంతా ఫుల్ స్టాప్ అని అనుకున్నారు. కానీ తాజాగా మనసు మార్చుకొని తిరిగి వస్తానంటున్నాడు.
రాయుడు క్రికెట్ జీవితమే గందరగోళంగా సాగింది. బీసీసీఐ ను ఎదురించి అప్పట్లో పెట్టిన రెబల్ సీసీఎల్ లీగ్ కు వెళ్లి ఆడాడు. దీంతో బీసీసీఐ నిషేధం విధించింది. భారత్ క్రికెట్ కు దూరమయ్యాడు. ఆ తర్వాత నిషేధం తొలిగాక బాగా ఆడి ఎంపిక కాకపోవడంతో బీసీసీఐ సెలెక్టర్లనే తప్పుపట్టాడు. రిటైర్ అయ్యాడు. చాలాసార్లు తనను పట్టించుకోని సెలెక్టర్లపై అసహనం వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలిచాడు. తన నోటిని కంట్రోల్ లో పెట్టుకొని ఓపికతో ఎదురుచూస్తే రాయుడు ఇంకా ఎంతో ఎత్తులో ఉండేవాడని.. ఆయన దుందుడుకు స్వభావమే ఈ పరిస్థితికి దిగజార్చిందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికైనా రెండో ఇన్నింగ్స్ లో మంచిగా అడుగులు వేస్తే రాయుడు క్రికెట్ జీవితం సాఫీగా సాగుతుందని సూచిస్తున్నారు.